మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆయనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు (Naga Babu) నివాసంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. గాండీవధారి అర్జున’ సినిమా (Gaandeevadhari Arjuna) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఓ బుల్లితెర ప్రోగ్రామ్‌కు అతిథిగా వెళ్లిన ఆయన.. హీరోయిన్ సాక్షి వైద్య, యాంకర్ తో కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్విక్‌గా సమాధానమిచ్చేశాడు మెగా హీరో. కాబోయే భార్య లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)పేరును మొబైల్లో ఎలా సేవ్ చేసుకున్నాడని ప్రశ్నించగా.. ‘Lavn’ అని సేవ్ చేశానని, ఫోన్ తీసుకుని తనే స్వయంగా అలా సెట్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక లావణ్యకు ఇచ్చిన తొలి గిఫ్ట్ ఏంటని అడగ్గా.. చాలా ఏళ్లు అయింది కదా గుర్తులేదని చెప్పాడు వరుణ్.