»Tamil Nadu Priest Bathes In Water Mixed With 108kg Chilli Powder
Priest పిచ్చి..? 108 కిలోల కారం కలిపిన నీటితో స్నానం.. ఎందుకంటే..?
తమిళనాడులో వింత ఆచారం ఉంది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఓ పూజారి స్నానం చేశాడు. భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలని.. అందుకే ఈ స్నానం చేశానని ఆ పూజారి చెబుతున్నాడు.
Tamil Nadu priest bathes in water mixed with 108kg chilli powder
priest bath chilli powder mix water: దేశంలో ఒక్కో చోట ఒకలా ఉంటుంది. వివిధ మతాలు, సాంప్రదాయాల ప్రకారం ఆచారాలు ఉంటాయి. తమిళనాడులో ఓ పూజారి (priest) వింత ఆచారాన్ని పాటించాడు. అక్కడ వారికి కొత్తేమీ కాకపోవచ్చు.. ఆ వీడియో చూసిన వారు మాత్రం ఆశ్చర్యపోయారు. అవును.. మీరు కూడా ఓ లుక్కేయండి.
దురదృష్టం నుంచి భక్తులను కాపాడాలని కోరుతూ కారం కలిపిన నీటితో స్నానం చేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. 108 కిలోల కారం కలిపిన నీటితో బాత్ చేశారు. అమవాస్య రోజును ధర్మపురి జిల్లా నందనపల్లిలో గ్రామంలో ఈ ఘటన జరిగింది. అమవాస్య రోజును భక్తులు పుణ్య స్నానం ఆచరించడం అనవాయితీ. ఓ పూజారి మాత్రం కారం కలిపిన నీటిని స్నానానికి ఉపయోగించాడు.
To protect devotees from bad luck!
On the auspicious day of Aadi Amavasai in Tamil Nadu's Dharmapuri district, a priest bathed in water mixed with 108 kg chilli powder pic.twitter.com/zWLjBsJryS
స్టీల్ డ్రమ్ముల్లో నీరు పోసి.. అందులో కారం వేసి కలిపే వీడియో చూడొచ్చు. స్టేజీ పైకి ఎక్కి పూజారి కూర్చొగా.. సహాయకులు కారం కలిపిన నీటిని అతడి తలపై నుంచి పోశారు. అమావాస్య అనేది పితృ దేవతలకు సంబంధించిన విషయం. ఉపవాసం, ప్రత్యేక పూజలతో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని స్థానికులు చెబుతున్నారు.