టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.