SRCL: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పండగ రోజే విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పండగ వాతావరణానికి బదులు రోదనలతో దుఃఖసాగరం కనిపిస్తోంది. ఇద్దరు అన్నదమ్ముల కుమారులు ఒకే రోజు మృతి చెందడం కలచివేసింది. కళాధర్ రెడ్డి గుండెపోటుతో, రాజిరెడ్డి (HM) బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది.