Vyooham: హ్యూహం గత ఎపిసోడ్స్ లో హైదరాబాద్ లో ఏదో టెర్రిరిస్ట్ ఎటాక్ జరగబోతుందని, అక్కడే అక్బర్ మనిషి ఉన్నాడని డిపార్ట్ మెంట్ కు అలెర్ట్ వస్తుంది. దాంతో అక్బర్ కోసం వెళ్లిన అర్జున్ టెర్రరిస్టులు ట్రాప్ లో చిక్కుతాడు. ఓపెన్ చేస్తే రాములు టిఫిన్ తింటుంటాడు. అక్కడి ఒక స్కూల్ పాప వస్తుంది. తనకు చూసి ఆప్యాయంగా హాయ్ చెప్తాడు. పాప స్కూల్ బ్యాగ్ క్లిప్ పెట్టుకోలేదని బ్యాగ్ క్లిప్ పెట్టి పేరు అడుగుతాడు. తరువాత పాప ఇంటికి వెళుతూ రాములుకు బై చెప్తుంది. రాములు హ్యాప్పిగా ఫీల్ అవుతాడు. తరువాత తనకు ఫోన్ వస్తే డబ్బులు వచ్చాయి అన్నా అని తన ఓనర్ కు చెప్తాడు. నెక్ట్స్ సీన్లో అర్జున్ ఫాదర్ తో అమృత ఫాదర్ వీరి పెళ్లి త్వరగా చేసేయాలి అని మాట్లాడుతుంటాడు. దానికి అర్జున్ ఫాదర్ కాస్త్ ఆందోళనగా ఉంటాడు. అంతలో అక్కడికి పోలీసు ఆఫీసర్ చలపతి వస్తాడు. అతన్ని దగ్గరకు వెళ్లి ఏదైనా తెలిసిందా అని అడుగుతాడు. రాత్రి నుంచి చాలా టీమ్స్ అర్జున్ కోసం వెతుకుతున్నాము కానీ ఏ క్లూ లేదని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి అమృత వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. అర్జున్ రాత్రి నుంచి మిస్సింగ్ అని చెప్తాడు. అమృత ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే అర్జున్ ను కట్టేస్తారు. మరోసీన్లో రాంజీ టిఫిన్ చేస్తుంటాడు. అక్కడ నీలవేణి అని టిఫిన్ బండి అతను తన వైఫ్ ను పిలుస్తాడు. దాంతో అర్జున్ కు తన భార్య గుర్తుకు వస్తుంది. ఫోటో తీసి చూసి గతం తలుచుకుంటాడు. నీలవేణిని తాను అచ్చం నిహారికాలానే ఉంటుంది. తనను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. అదే సమయంలో రాంజీ పనికోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చే సరికి ఇంట్లో నీలవేణి ఉండదు. ఏమైందని తన ఫ్రెండ్ ను అడిగితే నువ్వు వెళ్లిన వారం రోజులకే ఆ రైస్ మిల్లు అతనితో తిరిగింది, అతనితోనే వెళ్లిపోయింది అని చెప్తాడు. దాంతో రాంజీ బాధ పడుతాడు. దాన్ని తలుచుకుంటాడు రాంజీ.
చదవండి:Pushpa 2: ఇంకా 50శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదా..?
అర్జున్ ను కట్టేసిన ప్లేస్ లో అందరూ నిద్రపోతుంటారు. అర్జున్ కట్లు తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. రామరాజు లేస్తాడు. అర్జున్ మళ్లీ సైలెంట్ గా పడుకుంటాడు. అందరూ పడుకోగానే మళ్లీ తన కట్లు విప్పుకుంటాడు. రామరాజు దగ్గర గన్ తీసుకొని హ్యాట్సప్ అని తన ఫోన్ తీసుకొని ఆన్ చేస్తాడు. మరో సీన్లో చలపతి ఫోన్ ఆన్ అయిందని చెప్పడంతో అందరూ అర్జున్ లొకేషన్ కు వెళ్లి వాళ్లను పట్టుకుంటారు. తరువాత ఒక ఐరన్ డంపింగ్ ప్లేస్ లో మరో ఎస్ఐ లోకేష్ కొందరితో మాట్లాడుతుంటే జీవన్ ఫోన్ తో రికార్డు చేస్తాడు. ఏదో సౌండ్ వచ్చిందని వారు చూడమంటే ఒక అతను వచ్చి చూస్తాడు. జీవన్ పక్కనే దాక్కుంటాడు.
నెక్ట్స్ సీన్లో అర్జున్ పై అటాక్ చేసిన వాళ్లను విచారిస్తుంటారు. తనను టెర్రరిస్ట్ అంటే అలా పిలవకండి అని అంటాడు చైతన్య. మరి అక్బర్ తో ఎందుకు చేతులు కలిపావు. నా మీద ఎందుకు ఎటాక్ చేశావు. నీ వలన ఒక లేడీ ప్రాణం పోయేలా ఉంది అని అర్జున్ అడుగుతాడు. ఆ లేడీ ఇంకా బతికే ఉందా అని క్యూరియాసిటీతో అడుగుతాడు. నీకు జెస్సికా తెలుసా.. ఎవరు నువ్వు అని అర్జున్ అడుగుతాడు. నేను ఒక ఫోన్ చేసుకోవాలి అని అతను అంటాడు. అర్జున్ తన ఫోన్ ఇస్తాడు. స్పీకర్ పెడుతాడు. తాను యానీ అనే లేడీకి కాల్ చేసి నన్ను అరెస్ట్ చేశారు. ఏం జరిగినా మన ప్లాన్ ఎగ్జీగ్యూట్ చేయమని చెప్తాడు. దాంతో పోలీసులు ఫోన్ లాక్కుకొని అతన్ని కొడుతారు. అర్జున్ కొట్టకండి అని చెప్తాడు.
తరువాత జీవన్ ఎస్ఐ ని ఫాలో అవుతూ బైక్ పై వెళ్తుంటాడు. అదే సమయంలో ఒక కారు స్పీడ్ గా వెళ్తుంది. కారు ఓవర్ టేక్ చేసిందని అతను కారును ఆపీ వాళ్లను దబాయిస్తుంటే ఎస్ఐ కళ్లలో ఏదో పౌడర్ చల్లి అతన్ని కిడ్నాప్ చేసుకొని వెళ్తారు. అదే కారును జీవన్ ఫాలో అవుతుంటాడు. తరువాత అర్జున్ కు ఫోన్ చేసి విషయం చెప్దామంటే, చైతన్యను ఇంటరాగేట్ చేస్తూ తన ఫోన్ లిఫ్ట్ చేయడు. చైతన్య గురించి చెప్పమంటే అతను యూఎస్ఏ లో సెటిల్ అయినట్లు చెప్తాడు. వాళ్ల ఫాదర్ కోసం వస్తుంటే ఫ్లైట్ లో మ్యాంటినీ కలిసినట్లు చెప్తాడు. వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ తన డాడీ ఫోటో చూపిస్తాడు.
తరువాత క్యాబ్ కోసం చూస్తుంటే అతను డ్రాప్ చేస్తా అంటూ మ్యాంటీ అతన్ని ఎక్కించుకుంటాడు. తన ఫ్రెండ్స్ కూడా వాళ్లతో పాటే ఎక్కి అతన్ని కిడ్నాప్ చేస్తారు. అతన్ని ఒక చోటుకు తీసుకెళ్లి వాళ్ల నాన్నను కిడ్నాప్ చేసిన వీడియో చూపిస్తారు. వాళ్లు చెప్పినట్లు చేస్తే మీ నాన్న సేఫ్ గా ఉంటాడు అని చెప్పి ఒక కారు సిటీకి తీసుకు వెళ్లాలి అని చెప్తాడు. దానిలో బాంబు ఉంటుంది. దాంతో అతను కారు డ్రైవ్ చేస్తుంటే ఆ టెన్షన్ లో మైకల్, జెస్సీని ఢీ కొడుతాడు. తరువాత కారును కంగారుగా డ్రైవ్ చేస్తుంటే చెక్ పోస్ట్ వద్ద బార్ గేట్స్ కు తాకుతుంది. దాంతో పోలీసులు అతన్ని కారు పక్కకు తీయమని అడుగుతుంటారు. చైతన్య ఫోన్లో మాట్లాడుతూ సైగల ద్వారా కారులో బాంబ్ ఉందని చెప్తాడు. అక్బర్ ఫోన్ ని ఫోటో తీసుకుంటాడు. గ్రీన్ క్యాప్ ఉన్న వ్యక్తే మీరు వెతుకుతున్నది అని చెప్తాడు చైతన్య. దాంతో కారును దూరంగా తీసుకుపో అని చెప్తాడు అక్బర్. తరువాత రాజారామ్ తో ఆ గ్రీన్ క్యాప్ అతన్ని పట్టుకో అని అక్బర్ చెప్తాడు.
తరువాత అక్బర్ ఫోన్ లొకేషన్ తో మ్యాంటీ దగ్గరకు వెళ్తుంటాడు. చైతన్య సిటీ అవుట్ స్కట్స్ కు వెళ్తాడు. అక్బర్ తన టీమ్ తో వెళ్లి మ్యాంటి మనుషులను, అతన్ని కాల్చి చైతన్య ఫాదర్ ను కాపాడుతాడు. చైతన్య కారును ఎమ్టీ ప్లేస్ కు తీసుకెళ్లి కాల్ చేస్తాడు. బాంబ్ స్వ్కాడ్స్ వచ్చి దాన్ని తీసేస్తారు. ఈ కేసును అక్బర్ యుగేంధర్ కు అప్పజెప్పాడని, తనకు థ్రెట్ ఉండొచ్చని ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని చెప్తాడు చైతన్య. తరువాత కార్లో తన ఫింగర్ ప్రింట్స్ క్లియర్ చేసి మోమన్ కారును డ్రైవ్ చేసినట్లు క్రియేట్ చేశారు అని చెప్తాడు.
సస్పెండ్ అయిన అక్బర్ ఇందంతా చేశాడా, పైగా యుగేంధర్ కు ఎందుకు క్రెడిట్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటారు. అదే సమయంలో జీవన్ వచ్చి ఎస్ఐ లోకేష్ ను కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. ధర్మేష్ తొందరగా అది కనుక్కోండి అని అర్జున్ చెప్తాడు. అర్జున్ కు ఫోన్ వస్తుంది చైతన్య పాస్ పోర్ట్ చెక్ చేశాను అతను చెప్పింది నమ్మొచ్చు అని చెప్తాడు తన ఫ్రెండ్. తరువాత అక్బర్ ఇదంత ఎందుకు చేశాడు, ఇప్పుడు ఎవర్ని వెతుకాలి అంటే రాజారామ్ ను విచారించాలి అని మాట్లాడుకుంటారు.
తరువాత జలాల్, అక్బర్ ను తీసుకొని చినాబ్ దగ్గరకు వెళ్తాడు. చినాబ్ అక్బర్ ను హగ్ చేసుకుంటాడు. మరో సీన్లో రాజారామ్ ను విచారిస్తే అక్బర్ గురించి తనకేమి తెలియదు అని చెప్తాడు. అదే సమయంలో అర్జున్ ఫోన్ కు మెసేజ్ లు వస్తాయి. పోలీసువని మర్యాదగా అడుగుతున్నా నిజం చెప్పు అని అంటాడు. తరువాత మరో పోలీసుకు ఏదో ఇన్సురెన్స్ కంపెనీ మెసేజ్ అని అనుకుంటాడు. అక్బర్ కు కాల్ చేయమని ఫోన్ ఇస్తాడు అర్జున్, దాన్ని చూసిన రాజారామ్ ఇది కోడ్ మెసేజ్ అని అక్బర్ సర్ ఏదో డేంజర్ లో ఉన్నాడు అని చెప్తాడు. అతని కోసం ఓల్డ్ సిటీలో వెతుకుతుంటారు. అదే సమయంలో తన బాస్ ఫోన్ చేస్తే వెతుకుతున్నామని చెప్తాడు. లోకేష్ కోసమే వెతుకుతున్నాము మీకు చెప్పిన అర్థం కాదు అని రాజారామ్ తో అర్జున్ అంటాడు. అక్బర్ చినాబ్ తో కూర్చొని భోజనం చేస్తుంటాడు. చినాబ్ అక్బర్ ను రెచ్చగొట్టాలని చూస్తాడు. కాని అక్బర్ వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. సిటీలో బాంబులు పెట్టడం ద్వారా ఏవరికి శాంతి వస్తుంది. ఇదేనా అల్లా చెప్పింది. మీరు చేసేది తప్పు అని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇది ఎప్పటి ఆగదు మరణం తరువాత కడా ఆగదు అని తెలుసు అంటాడు. తినడం అయిపోయిన తరువాత టోపి దరించి ఇక మీరు ఏం చేస్తారో నాకు తెలుసు చంపేయండి అని తల ఒంంచుతాడు.
మరో సీన్లో ధర్మేష్, అర్జున్ ఒక అతన్ని ఇంటరాగేట్ చేస్తుంటారు. తనకు ఏం తెలియదు అని, ఎస్ఐ లోకేష్ భరత్ ఫోటో చూపించాడు. వాళ్ల ఫ్యామిలీని చంపమన్నాడు సర్ అని చెప్తాడు. అతని ఫోన్ అన్ లాక్ చేసి ఒక వ్యక్తిని చూసి ఇతనను మైకల్ కేసులో మనకు కావాలి కదా అని భరత్ ఫోటో చూపిస్తాడు. అర్జున్ స్కెచ్ లను పోల్చుకొని చూస్తాడు. మరో సీన్లో ఎస్ఐ వినోద్ ఫైల్స్ వెతుకుతుంటాడు. భరత్ చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు డీన్ తో చెప్పి అతన్ని పంపిస్తాడు. అదే సమయంలో లోకేష్ అక్కడి వస్తే ఏదో చిన్న పెట్టీ కేసు అని చెప్తాడు. తరువాత జర్నలిస్ట్ నిర్మాల హత్యను లోకేష్ భరత్ మీదకు వచ్చేలా ప్లాన్ చేశాడని ఆలోచిస్తాడు. మరో సీన్లో లోకేష్ ను కిడ్నాప్ చేసింది భరత్. తాను చేయని కేసులో ఎందుకు ఇరికిచ్చారు అని అడిగితే నువ్వే చేశావు అని లోకేష్ అంటాడు. దాంతో కత్తితో లోకేష్ కాలు మీద పొడిచి నిజం చెప్పమంటాడు. తన ఫ్రెండ్ భయపడుతుంటాడు. అదే సమయంలో లోకేష్ ను ఎవరో కాల్చి చంపేస్తారు. అతని కోసం బయటకు పరుగెత్తగానే పోలీలసులు భరత్ ను పట్టుకుంటారు.
తరువాత ఇమ్రాన్ కు ఫోన్ వస్తుంది. వెంటనే బాత్రుంలోకి వెళ్లి తన అమ్మతో ఫోన్ మాట్లాడుతాడు. తన అన్న గురించి మాట్లాడుతూ ఏడుస్తుంటారు. బయటకు రాగానే జలాల్ ఫోన్ తీసుకెళ్తాడు. ఎందుకు అంటే ఎన్ని సార్లు చెప్పాలి ఫోన్ వాడొద్దు అని అంటాడు. తరువాత గన్ ఎక్కడ దాచావు అని భరత్ ను విచారిస్తారు. అక్కడికి ప్రజ్వల్ వస్తాడు. జర్నలిస్ట్ నిర్మల కేసులో వీళ్లకోసం వెతుకుతున్నాను, పట్టుకున్నందు గుడ్ జాబ్, వాళ్లను నాకు అప్పగించండి అని చెప్తాడు. ఇంకా విచారణ అయిపోలేదు సర్ అని అర్జున్ అంటాడు. నేను చూసుకుంటా అని ప్రజ్వల్ అంటాడు. అతను వెల్లిపోయిన తరువాత అర్జున్ పై సీనియర్ ఆఫీసర్ అరుస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా, అది కేవలం హిట్ అండ్ రన్ కేసు అని కేసు క్లోజ్ చేయమంటాడు. కట్ చేస్తే మైకల్ ను పిలిచి ఇది కేవలం హిట్ అండ్ రన్ కేస్ అని క్లోజ్ చేస్తున్నట్లు చెప్తాడు. దాంతో నా లాస్ గురించి ఎవరు పట్టించుకోరా అని అడుగుతాడు. ఇది చాలా కాంప్లమెంట్ కేసు అని కేసు విత్ డ్రా చేసుకో అంటాడు. దానికి అది కుదరదు నా బిడ్డ ప్రాణాలకు ఎంత ఇస్తారు. ఈ కేసు ఎలా క్లోజ్ చేస్తారో నేనూ చూస్తా అని వెళ్లిపోతాడు.
మరో సీన్లో రాముల పంపించిన డబ్బులు అందినట్లు, నేను సామాను తీసుకొని వస్తాను, నువ్వు ముత్యాలు ఫోటో తీసుకొని రా అని స్వామి చెప్తాడు. తరువాత రెడ్డన్నతో.. పోలీసు స్టేషన్లో జరిగిన విషయాన్ని మైకల్ చెప్తాడు. అదే సమయంలో గౌతమ్, నేహ ఇద్దరు అక్కడికి వస్తారు. మైకల్ వాళ్లను గుర్తుపడుతాడు. కానీ ఏం చెప్పకుండా వెళ్లిపోతాడు. అక్కడే రాంజీ ఉంటాడు. తరువాత నాలలో డెడ్ బాడీ దొరికిందని అక్కడికి వెళ్తే అక్భర్ డెడ్ బాడీ దొరుకుతుంది. బాడీని ఐడెంటీఫై చేయలదేని అబద్దం చెప్తాడు అర్జున్. బాడీని చూసి రామరాజు ఎమోషనల్ అవుతాడు.
తరువాత సీన్లో అర్జున్ కు పార్సల్ వచ్చిందని చూస్తే అందులో బొమ్మ ఉంటుంది. ఇలాంటిది అక్బర్ ఇంట్లో చూసినట్లు రామరాజు చెప్తే అక్కడ క్లూస్ వెతకడానికి వెళ్తారు. అక్కడ తన ఫ్యామిలీ 2013 దిల్ సుక్ నగర్ బాంబుకేసులో చనిపోయినట్లు చెప్తాడు రామరాజు. తరువాత ఆ బొమ్మలను వెతికితే చిప్ దొరుకుతుంది. అందులో అక్బర్ ను చంపిన ఫుటేజ్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. నాకు టీమ్ కావాలని అడుగుతాడు.. తన ఆఫీసర్ ఇస్తా అంటాడు.
నెక్ట్స్ సీన్లో జర్నలిస్ట్ నిర్మలను ఎందుకు మర్డర్ చేశారని భరత్ ను తన ఫ్రెండ్ ను పోలీసులు కొడుతుంటారు. ఒప్పుకునేంత వరకు కొట్టండి అని ప్రజ్వల్ చెప్తాడు. వినోద్ ఆలోచిస్తాడు. తరువాత అర్జున్ బంధీ చేసిన వ్యక్తి కోసం ఎవరో వచ్చారని చూస్తే అక్కడ అర్జున్ నాన్న ఉంటాడు. అది చూసి చలపతి వీడు మీకు తెలుసా అని అంటే అవును అంటాడు.
తరువాత సీన్లో అక్బర్ ను చంపింది చినాబ్, జలాల్ అని వాళ్ల ఎస్ఆర్టీ సీఐకి ఫోటోలు చూపిస్తుంటే చలపతి ఫోన్ చేస్తాడు. దాంతో తాజ్ మహాల్ కు వెళ్తే అక్కడ అర్జున్ ఫాదర్ ఉంటాడు. జెనా పారపోతాడు. పరుగెత్తిన పట్టుకోలేరు. అర్జున్ నిజం చెప్పమంటే వాళ్ల నాన్న చెప్పడు. దాంతో అతన్ని అరెస్ట్ చేయమంటాడు.
తరువాత సీన్లో మైకల్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. తన దగ్గర డబ్బులు తీసుకొని ఎంజయ్ చేస్తున్నావు అని డబ్బులు కట్టు అని రెడ్డన్న ఒత్తిడి చేస్తాడు. అతను టైమ్ అడుగుతాడు. తన దగ్గర ఉన్న డాబ్లెట్స్ అమ్మిపెట్టమని ఆఫర్ ఇస్తాడు. దాంతో రెడ్డన్నకు హెల్ప్ చేసి డబ్బులు సంపాదిస్తాడు. తరువాత స్టార్టప్ కోసం చూస్తున్నట్లు ప్రవీణ్ తో చెప్తాడు. నెక్ట్స్ ఒక మెడికల్ క్యాంప్ లో కల్తీ మందులు ఇచ్చి ఒక ఆవిడ చనిపోతుంది. ఆ కేసులో మైకల్ బాస్, చైతన్య ఫాదర్ అరెస్ట్ అవుతాడు. తరువాత రెడ్డన్నతో కలిసి కల్తీ మందులు గురించి డిస్కస్ చేస్తుంటాడు. తరువాత జేపీ గ్రూప్స్ తో డీల్ మాట్లాడడానికి వెళ్తే అక్కడికి జేపీ కొడుకు వస్తాడు. అతను నేహ ఫోటొ చూస్తుంటే నేహ నీకు తెలుసా అని పరిచయం చేసుకుంటాడు. తన బిజెనెస్ ప్రపొజల్ గురించి చెప్తాడు. ఇదే విషయాన్ని రెడ్డన్నకు చెప్పి కన్విన్స్ చేస్తాడు. మైకల్ ఆలోచిస్తాడు. తరువాత కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేస్తాడు. రాంజీ వచ్చి నీకు లెటర్ వచ్చిందని ఇచ్చి మైకల్ ను కొట్టి నేను చెప్పింది చేయకపోతే చంపేస్తా అంటాడు. తరువాత మైకల్ రాంజీని కొట్టి ఎవరు నువ్వు అని అంటాడు. అతను నీలవేణి, తాను పెళ్లి చేసుకున్న ఫోటో చూపిస్తాడు.
నీలవేణి రైస్ మిల్ అతనితో తిరుగుతుందని అక్కడివెళ్తాడు. అక్కడ నీలవేణి, రైస్ మిల్ ఓనర్ ఇద్దరు ఉంటారు. అతని చేతులో కత్తి ఉంటుంది. రాంజీ కోపంతో నీలవేణిని నరుకుతాడు. ఓనర్ భయపడుతాడు. తరువాత నీలవేణి చనిపోతుంది. ఇదే విషయాన్ని మైకల్ కు చెప్తాడు. తరువాత జైల్లో రాంజీ ఒక ఉపదేశం వింటాడు. ఆత్మ చనిపోదు అని, మీరు చంపిన వాల్లు ఎక్కడో పుట్టే ఉంటారు అని చెప్తాడు. రాంజీ విడుదలై ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకుంటుంటాడు. ఆ సమయంలో నిహరికా, గౌతమ్ కనిపిస్తారు. తనను ఫోలో అవుతాడు రాంజీ. నా నీలవేణి నాకోసం మళ్లీ పుట్టిందని నమ్ముతాడు.
తరువాత పోలీసు స్టేషన్ లో అర్జున్ ఫాదర్ ఉంటాడు. అక్కడికి అమృత వస్తుంది. ఎందుకు తీసుకొచ్చారు అని వాళ్లతో మాట్లాడి తనను తీసుకొని వెళ్తుంది. అర్జున్ చూస్తూ ఉంటాడు. తరువాత అర్జున్ కు అమృత కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయడు. అర్జున్ కు ఒక మెసేజ్ వస్తుంది. జన చైతన్య రిపోర్ట్ కు ఫోన్ చేస్తాడు. మరో సీన్లో చినాబ్ తన వాళ్లకు ప్లాన్ గురించి చెప్తాడు.
తరువాత రిపోర్టర్ తో అర్జున్ మాట్లాడుతాడు. 2002లో స్కామ్ గురించి చెప్తాడు. ఆ కేసులో ఒక అతన్ని పట్టుకొని కొడుతుంటారు. తనను నేను డీల్ చేస్తా అని వాణి చెప్తారు. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి బయటకు తీసుకెళ్లడానికి మీ వాళ్లు వస్తారు అని చెప్తుంది. అలాగే రాత్రి తనను తీసుకొని వెళ్తుంటే అతను గన్ పెట్టి దిగిపోతాడు. అతన్ని తప్పించమని ఫోన్ చేశారని చెప్తుంది. అతన్ని ఒక ప్లేస్ కు తీసుకెళ్లి తనతో నాటకం ఆడి అతని బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుంటుంది. అక్కడికి పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్తారు. ఈ ఘటన తరువాత వాణిని చంపేసినట్లు చెప్తాడు.
తరువాత ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అందరితో పాటు పారిపోయిన వ్యక్తి జెనా కూడా ఉంటాడు. అర్జున్ కోపంతో అతని చొక్క పట్టుకుంటాడు. అతను మీ అమ్మను చంపలేదు అని అమృత అంటుంది. చంపిన వారిలో ఇతను ఉన్నాడు అని నాన్న చెప్పాడు కదా అంటాడు. దాంతో అప్పుడు తాను కూడా ఉన్నట్లు జెనా చెప్తాడు. అర్జున్ షాక్ అవుతాడు.
అడవిలో నక్సలేట్స్ సంబరాలు చేసుకుంటుంటే పోలీసు కుంబింగ్ జరుగుతుంది. అదే సమయంలో తాను వాళ్లనుంచి తప్పించుకొని ఒక చోట దాక్కుంటాడు. అక్కడికి వాణి వచ్చి అతని దగ్గర గన్ కాదు పెన్ ఉండాలి అని తనను చంపకుండా వెళ్తుంది. అయినా సరే తాను అదే దళంలో ఉండి పెద్దవాడు అయినట్లు చెప్తాడు. అదే సమయంలో వీణ అర్జున్ తీసుకొని బీచ్ లో నడుస్తుంటే అతను చూస్తాడు. తనను చంపడానికి కొందరు వెళ్తుంటే వద్దురా అని పరుగెత్తుకుంటూ వస్తాడు. అంతలో వారు కాల్చేస్తారు. మేడమ్ ని కాపాడాలని ట్రై చేస్తాడు కానీ తను చనిపోతుంది. అక్కడికి అర్జున్ నాన్న, చెల్లెలు వస్తారు. తరువాత అతను దళాన్ని వదిలేస్తాడు. ఒక ట్యాక్సీ నడుపుతుంటే అక్కడ జర్నలిస్ట్ నిర్మల పోరటాన్ని చూస్తుంటాడు. అక్కడికి ఒక అతను వచ్చి వాణి మేడాన్ని చంపింది నక్సలేట్లు కాదు అది పొలిటికల్ మర్డర్ అని చెప్తాడు. దాంతో వాళ్ల గ్యాంగ్ లో ఉన్న కరణ్ అనే వ్యక్తిని, మరొకరిని చంపేస్తాడు జెనా. తరువాత ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలారు వాళ్లను కూడా చంపాలని జెన్ ఓల్డ్ సిటీకి వస్తాడు. అదే సమయంలో నీ బైక్ ఎక్కినట్లు తరువాత ఇదంత జరిగినట్లు చెప్తాడు. వాణిని చంపిన వారిలో నువ్వు ఉన్నావు అని తెలిస్తే నిన్ను చంపేస్తారు అని అర్జున్ తండ్రి అతన్ని పంపించేస్తాడు. ఇదే విషయాన్ని జెనా చెప్తాడు.
మరో సీన్లో రాముల అంబులెన్స్ చూడడానికి వెల్తాడు. నెక్ట్స్ సీన్లో నేహ, గౌతమ్ ఇద్దరు రెస్టారెంట్లో సరదాగా ఉంటారు. అక్కడే మైకల్ ఉండి వాళ్లను అబ్జర్వ్ చేస్తాడు. నెక్ట్స్ భరత్ ఈ మర్డర్ చేయలేదు సర్, దీన్ని పూర్తిగా ఇన్విస్టిగేట్ చేయలేదు అని వినోద్ చెప్తాడు. నిర్మాల చనిపోయినప్పుడు భరత్ జైల్లో ఉన్నాడు, చిన్న చైన్ స్నాచింగ్ కేసులో జైల్లో ఉన్నాడు అని ప్రజ్వల్ సర్ కు చెప్తే వినడం లేదు అని అంటాడు. తరువాత అర్జున్ ప్రజ్వల్ దగ్గరకు వెళ్లి భరత్ తో మాట్లాడాలి, మైకల్ ఇచ్చిన కేసులో అతను కూడా అక్యూస్ డ్ గా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో అతన్ని ఫ్రెండ్ ను పంపిస్తాడు ప్రజ్వల్. పర్సనల్ గా మాట్లాడాలి అన్నా ఒప్పుకోడు కానిస్టేబుల్. దాంతో అర్జున్ మీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అని మొబైల్ టో టైప్ చేసీ తనకు కావాల్సి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాడు.
కల్వకుర్తిలో భరత్ ప్రొఫేసర్ దగ్గరకు వెళ్తాడు అర్జున్. భరత్ జైల్ ఉన్నట్లు ఒక రోజు ఫోన్ రావడంతో స్టేషన్ కు వెళ్లాను, అప్పుడే తెలసింది భరత్ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యాడు అని, తరువాత అతన్ని రిహబిలిటేషన్ లో జాయిన్ చేశాము, అతను రికవరీ అయిన తరువాత స్టేషన్ కు వెళ్లి సైన్ చేసినప్పుడు అక్కడ వినోద్ లేడని లోకేష్ ఉన్నట్లు చెప్తాడు. అప్పటి నుంచి భరత్ తనతోటే ఉన్నట్లు చెప్తాడు. ఒక రోజు లోకేష్ ఇంటికి వచ్చాడని ఏం జరిగిందో చెప్పకుండా ఇళ్లంత వెతుకుతున్నాడు అని నిర్మల అనే జర్నలిస్ట్ ను భరత్ హత్యచేసినట్లు చెప్పి, ఒక బ్యాగ్ ను తీసుకొచ్చి అందులో చైన్ ఉందని చెప్తాడు. తరువాత ఒక నిమిషం అని ప్రొఫెసర్ భరత్ కు ఫోన్ చేస్తాడు అదే సమయంలో లోకేష్ అతన్ని కొడుతాడు. భరత్ వచ్చి పోలీసుతో గొడవపడి ప్రొఫెసర్ ను తీసుకొని ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వెళ్తుంటారు. తరువాత మర్డర్ జరిగిన రోజు భరత్ హైదరాబాద్ లో ఉన్నాడు అని చలపతి కన్ఫామ్ చేసుకుంటాడు. దాంతో మీరు మాతో హైదరాబాద్ రావాలని అర్జున్ చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో భరత్ తానే మర్డర్ చేసినట్లు లెటర్ రాస్తాడు. అర్జున్ స్టేషన్లో దిగిపోతా అని అంటాడు. అర్జున్ కేసు స్టడీ చేస్తుంటాడు. దీక్షిత్ తో మాట్లాడుతాడు. తరువాత కేసు స్టడీ చేస్తాడు. ఎస్ఆర్జీ మైనింగ్ కంపెనీ డాక్యుమెంట్స్ గురించి అమృత హెల్ప్ తీసుకుంటాడు. తరువాత ఈ కేసులో జరిగిన అన్ని సంఘటనకు గుర్తు చేసుకుంటాడు. దీని వెనుక ఉంది మొత్తం మైనింగ్ కంపెనీ అని, దాని వెనుక ఉంది అడిషనల్ డీజీపీ ప్రజ్వల్ అని చెప్తాడు. వాణిని హత్య చేయడానికి సాయం చేసింది. జర్నలిస్ట్ నిర్మాల దీక్షిత్ ను చంపడంలో కూడా ప్రజ్వల్ హ్యండ్ ఉందని చెప్తాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్తే ఎలా ప్రూఫ్ చేస్తావు అని అడుగుతాడు.
నెక్ట్స్ సీన్లో ప్రెస్ మీట్లో నిర్మాల మర్డర్ చేసింది భరత్ అని చెప్తాడు ప్రజ్వల్. అదే సమయంలో జర్నలిస్ట్ లు క్వశ్చన్లు స్టార్ట్ చేస్తారు. ఎస్ఆర్జీ కంపెనీ ఓనర్ మనీషా, ప్రజ్వల్ కు ఉన్న సంబంధం గురించి, ఎస్పీ వాణి రామచంద్ర మర్డర్ కు మీకు ఏదైనా సంబంధం ఉందా అని క్వశ్చన్స్ అడుగుతారు. దాంతో ప్రజ్వల్ లేచి వెళ్లిపోతాడు.
తరువాత రెడ్డన్న ఇంటికి మైకల్ వెళ్తాడు. రెడ్డన్న తో మాట్లాడుతాడు. అదే సమయంలో రాంజీ రెడ్డన్న ఇంట్లో అందరిని చంపెస్తాడు. అదే సమయంలో రెడ్డన్నను మైకల్ చంపేస్తాడు. తరువాత కిట్టును చంపేసి ఇద్దరు కలిసి నేహను తీసుకెళ్తారు.
ఏసీపీ అర్జున్ నడిపిన బైక్ గురించి తెలుసుకొని రామరాజు మైకల్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. తరువాత నిర్మాల దీక్షిత్ మర్డర్ కేసులో ప్రజ్వల్ విషయం బయటపడిందని, భరత్ నిర్దోషి అని న్యూస్ వస్తుంది. తరువాత చినాబ్ కు సంబంధించిన వీడియో అర్జున్ కు వస్తుంది. దాంతో తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేసినట్లు చెప్తాడు. తరువాత తనకోసం ఎవరో వచ్చారని అర్జున్ బయటకు వస్తే అక్కడ ఒక లేడీ ఉంటుంది. తను అర్జున్ కు వాళ్ల ప్లాన్ గురించి చెప్తుంది.
మరో సీన్లో మైకల్ ఏదో ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో నేహ దగ్గరకు రాంజీ ఫుడ్ తీసుకొని వస్తాడు. తాను నీలవేణి అని ఫోటో చూపిస్తాడు. అక్కడే మైకల్ ఉంటాడు. తరువాత సీన్లో అర్జున్ తో ఆ అమ్మాయి దిల్ సుక్ నగర్ లో బ్లాస్ట్ జరిగినప్పుడు తాను గాయపడ్డట్లు చెప్తుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్బర్ సర్ తన కొడుకు కోసం వచ్చాడు. ఫస్ట్ టైమ్ అక్బర్ ను అక్కడే చూశాను అని తరువాత అతని కొడుకు చనిపోయాడు అని చెప్తుంది. తరువాత తనతో మాట్లాడానని రహానా చెప్తుంది. రెండు ఏళ్ల క్రితం తనకు లీడ్ దొరికింది అని జలాల్ తో దగ్గరవ్వాలని రహానా ట్రై చేస్తుంది. ఒక హోటల్లో అతనితో కలసి భోజనం చేస్తుంది. అలా తనతో క్లోజ్ అవుతుంది. తన రహస్యాలు తెలుసుకుంటుంది. అదే సమయంలో మ్యాంటీ వస్తున్నాడు అని తన విషయం అక్బర్ కు చెప్పి బాంబ్ బ్లాస్ట్ ను ఆపుతుంది. ఆ విషయం యుగేంధర్ టెర్రరిస్ట్ లు చెప్పాడు. అందుకే వాళ్లు అక్బర్ ను చంపారు అని చెప్తుంది. వాళ్ల నెక్ట్స్ ప్లాన్ ఏంటో తెలియదు అంటుంది.
ఒక ఆప్షాన్ ఉంది, ఇమ్రాన్, మ్యాంటీ తమ్ముడు అని చెప్తుంది. దాంతో పోలీసులు ప్లాన్ చేస్తారు. మ్యాంటీ బాడీకోసం ఎవరు రాకపోతే దాన్ని కాల్చేస్తామని చెప్తారు. దాంతో అన్న కోసం ఇమ్రాన్ జలాల్ తో గొడవపడి వాడిని కాల్చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ తన అన్న బాడీని చూస్తాడు. ఎమోషనల్ అవుతుండగా పోలీసులు అతన్ని పట్టుకుంటారు. తరువాత రహానా ఇమ్రాన్ తో మాట్లాడుతుంది. నువ్వు టెర్రరిస్ట్ కాదని, నిజం చెప్పు అని అంటుంది. జమ్లీ మహాల్ లో బాంబ్ ప్లాన్ ఉంది అని చెప్తాడు. తరువాత జలాల్, ఇమ్రాన్ కనిపించడం లేదని చినాబ్ తో ఒకరు అంటాడు. ఏది ఏమైనా ప్లాన్ ఎగ్జిగ్యూట్ అవ్వాలని చినాబ్ చెప్తాడు. తరువాత చినాబ్ ఇంటిని పోలీసులు రౌండప్ చేస్తారు. ట్రైనీల దగ్గరకు వెళ్లీ అర్జున్ ఫైట్ చేస్తుంటాడు. అదే సమయంలో చినామ్ పారిపోతాడు. అర్జున్ ఫైరింగ్ చేస్తాడు. అతన్ని చంపేస్తాడు అర్జున్. టెర్రరిస్టులను అర్జున్ పట్టుకున్నాడు అని న్యూస్ లో చెప్తుంటారు.
తరువాత అమృతతో డిన్నర్ చేస్తూ ఇదంతా చాలా యాదృశ్చికంగా జరిగిందని చెప్తుండగా మైకల్ ఫోన్ చేస్తాడు. నా కేసు ఎందుకు క్లోజ్ చేశావు అని అడిగి తను ఉన్న ప్లేస్ గురించి చెప్తాడు. వెంటనే అర్జున్ అక్కడికి వెళ్తాడు. మైకల్ తో మాట్లాడుతుంటే నేహా అరుస్తుంది. తనకోసం వేళ్తే రాంజీ అతన్ని కొడుతాడు. నెక్ట్స్ సీన్లో జెస్సీ కి నిజం తెలుస్తుంది. తరువాత అర్జున్ ని కట్టేస్తారు. అదంతా జస్ట్ కో ఇన్సిడెంట్ అని చెప్తాడు. అయినా మైకల్ తనను చంపాలని గన్ పెడుతాడు. అదే సమయంలో డాక్టర్ ఫోన్ చేసి జెస్సీకి గతం గుర్తుకు వచ్చిందని చెప్తాడు. జెస్సీ రాంజీని కత్తితో పొడుస్తుంది. అర్జున్ కట్లు విప్పుకొని మైకల్ తో ఫైట్ చేస్తాడు. మైకల్ అర్జున్ ను కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేహా అర్జున్ ను హాస్పటల్ లో జాయిన్ చేస్తుంది. తరువాత మైకల్ ఈ కేసు ఫైల్ గురించి అంతా చదువుతాడు. వీటి వెనుకా అన్నింట్లో మైకల్ హాస్తం ఉంటుంది అనే నిజం తెలుస్తుంది. చైతన్య డాడీ విషయంలో పోలీసులకు పట్టించింది, నేహా గౌతమ్ లను దూరం చేసింది, భరత్ ను ఇరికించింది అన్నింటికి కారణం మైకల్.
తరువాత అర్జున్ హాస్పటల్ ఉండగా అక్కడి తన ఫ్రెండ్ వస్తాడు. మొన్న షూట్ అవుట్ లో నువ్వు చంపిన అస్లామే మీ అమ్మను చంపింది అని చెప్తాడు. తరువాత అక్భర్ ను ఖననం చేస్తారు. నెక్ట్స్ ప్రజ్వల్ హత్య చేసుకున్న న్యూస్ ను చలపతి అర్జున్ కు చూపిస్తాడు. అర్జున్ తెలుసు అంటాడు. జెన్ అతన్ని చంపి వేలాడదిస్తాడు. అతని చొక్కాపై జనహితం అని రాస్తాడు. తరువాత వాణి మేడం దారిలోనే నువ్వు నడువు అని జనా చెప్తాడు. ఇదంతా చాలా విచిత్రంగా జరిగిందని అర్జున్ చెప్తాడు. మరో సీన్లో మైకల్ చర్చీలో తన వైఫ్ ప్రేయర్ చేసుకుంటుంది. తరువాత రాముల తన భార్య కర్మఖాండ నిర్వహిస్తాడు. మైకల్ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడని అక్కడికి అర్జున్ పోలీసులతో వస్తాడు. మైకల్ తో మాట్లాడుతాడు. తాను చాలా తప్పులు చేశాను కాని నా భార్య ముందు అరెస్ట్ చేయకండి అంటాడు. సరే అని అర్జున్ తనను తీసుకెళ్తుంటాడు. దారిలో వెళ్తుంటే ఎర్రసముద్రం అంజనేయస్వామి గుడికి దారి బోర్డు కనిపిస్తుంది. అదే సమయంలో ఎమర్జెన్సీ కోసం రాములు అంబులెన్స్ తీసుకొని వస్తాడు. అక్కడికి రాగనే జెస్సీ తల తిరగినట్లు అనిపిస్తుంది. అంబులెన్స్ లో ముత్యాలు ఫోటో కిందపడుతుంది. అది తీసుకునే క్రమంలో మైకల్ రాములు వెహికిల్స్ రెండు ఢీ కొట్టుకుంటాయి. జెస్సీ గాల్లో ఎగిరి దూరం పడుతుంది. మైకల్ కార్లో చిక్కుకుంటాడు.
జెస్సీకి ట్రీట్ మెంట్ ఇస్తాడు రాములు. మైకల్ దగ్గరకు వెళ్లగానే రాములును గుర్తుపడుతాడు. 5 సంవత్సరాల క్రితం అదే రోడ్డు అదే ప్లేస్ రాములు అంబులెన్స్ కు యాక్సిడెంట్ చేసి మైకల్, జెస్సికా హెల్ప్ చేయకుండా వెళ్లిపోతారు. తరువాత మైకల్ చనిపోతాడు. ఎన్నో జీవితాలు, ఎన్నో దారులు, మరెన్నో మలుపులు, గమ్యం మాత్రం ఒక్కటే అని ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది వ్యూహం ఫుల్ స్టోరీ.
చదవండి:Supreme Court: శ్రీమంతుడు కథ వివాదం.. కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ