Vyooham trailer 2: సంచనాలకు కేరాఫ్ అడ్రస్, ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ మూవీ వ్యుహం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ ప్రమోషన్లలో వర్మ బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ రెండో ట్రైలర్ విడుదల చేశారు. అందులో చంద్రబాబు పాత్రధారుడితో మాట్లాడే సీన్తో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ఇంతకాలం మిమ్మల్ని పైకి రాకుండా తొక్కేసిన వ్యక్తి పైకే పోయాడు.. ఇక మీరే అనడంతో మొదలవుతోంది.
ఓదార్పు యాత్రలో జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో అని హీరో అంటారు. నాన్న చనిపోయిన తర్వాత జరిగిన పరిస్థితిని చూసి చలించిపోయానని అంటారు. ఆ సమయంలో అందరినీ కలుస్తూ.. వస్తాడు. తర్వాత వ్యూహం అనే థీమ్ సాంగ్ రాగా.. హీరోను అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మౌన దీక్ష చేయడం.. భగ్నం చేసే సీన్స్ ఉన్నాయి.
చిరంజీవి, పవన్ కల్యాణ్ పాత్రధారుల మధ్య సీన్స్ ఉన్నాయి. పార్టీ పెట్టొద్దని చిరు చెప్పగా.. వినిపించుకోడు. తర్వాత బాబును పవన్ కల్యాణ్ కలుస్తారు. నా కోసం రాష్ట్రమంతా తిరగాలని చంద్రబాబు పాత్రధారి అంటారు. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న జగన్తో భారతి పాత్రధారి.. నువ్వు సీఎం కావాలని అంటారు. ఆ వెంటనే ఆయన జనాల మధ్యకు వెళ్లడం.. జరుగుతుంది. ఇంతలో తాను 150 సీట్లలో గెలుస్తానని పవన్ కల్యాణ్ అంటారు. నా నిజాన్ని గుర్తించేలా చేస్తాను.. ఇదే నా శపథం అని జగన్ పాత్రధారి అజ్మల్ అమీర్ అంటారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసి మూవీకి మంచి హైప్ ఇచ్చారు వర్మ.
వ్యుహం మూవీలో జగన్ పాత్రను అజ్మల్ అమీర్ (ameer) పోషిస్తున్నారు. అతని భార్య పాత్రను మానస రాధాకృష్ణన్ (manasa radhakrishnan) చేస్తున్నారు. మూవీ బయోపిక్ కాదని.. అంతకుమించి, రియల్ పిక్ అని గతంలోనే వర్మ ప్రకటించారు. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయని పేర్కొన్నారు. మూవీ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ పేరు వ్యుహం (Vyooham) కాగా.. రెండో భాగం పేరు శపథం అని రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రకటించారు.అప్పట్లో సీఎం జగన్ను (jagan) కలిసిన వెంటనే మూవీ గురించి వర్మ ప్రకటించారు.
అంతకుముందు వ్యూహం సినిమాకు (Vyooham Movie) సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ సర్టిపికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇందుకు గల కారణం వ్యూహం సినిమాలో నిజ జీవితంలో ఉన్న పాత్రల పేర్లను వాడటమే.. దానిపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత మూవీ మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించడం కమిటీ సానుకూలంగా ఉండటంతో యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.