సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చాననే ఆరోపణలకు సంబంధించి హీరో విశాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. అధికారులకు అన్ని వివరాలు తెలియజేశానని, విచారణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Vishal: సీబీఎఫ్సీపై హీరో విశాల్ (Vishal) చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారిస్తోంది. ఆ కేసుకు సంబంధించి విచారణ కోసం సీబీఐ అధికారులు విశాల్‌ను పిలువగా.. నిన్న ముంబై వెళ్లారు. ఆఫిషీయల్స్ అడిగిన ప్రశ్నలకు విశాల్ (Vishal) సమాధానం ఇచ్చారు. విచారణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
సీబీఐ ఆఫీసుకు రావడం కొత్త అనుభవం.. అధికారుల విచారణ తీరుపై సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ ఆఫీసు ఎలా ఉండాలనే అంశంపై సూచనలు తీసుకున్నారు. జీవితంలో సీబీఐ ఆఫీసుకు వస్తానని అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విశాల్ (Vishal) మూవీ మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విషయంలో సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందట. సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానని విశాల్ ఆరోపించారు. తన లాగా మరే నిర్మాత లంచం ఇచ్చే పరిస్థితి రాకూడదని విశాల్ (Vishal) అన్నారు. ఆ ఘటనపై ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం షిండేను విశాల్ కోరారు. ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది. ఆ క్రమంలో ఫిర్యాదుదారు విశాల్‌ను సీబీఐ అధికారులు విచారించారు.