ప్రశాంత్ నీల్(prashanth neel), ప్రభాస్(prabhas) కాంబోలో వస్తున్న సాలార్ మూవీ నుంచి డైరెక్టర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు కేజీఎఫ్ కు ఎలాంటి సంబంధం ఉడందని చెప్పారు. అంతేకాదు సాలార్ పార్ట్ 2 గురించి కూడా ప్రస్తావించారు.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(prabhas) యాక్ట్ చేసిన సాలార్ చిత్రం గురించి ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని చెప్పారు. కానీ తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులు, శత్రువులుగా కనిపిస్తారని చెప్పారు. కానీ కెజిఎఫ్‌తో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు పేర్కొన్నాడు.
ఇక ఈ మూవీ పార్ట్ 2(salaar part2) ఎప్పుడు అని దర్శకుడిని అడిగినప్పుడు అది లాజిస్టికల్ విషయమని చెప్పాడు. సాలార్ 2 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తాను చెప్పలేనని నీల్ అన్నారు. సాలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంది. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ 2024 మార్చిలో ప్రారంభమవుతుంది. మరోవైపు కల్కి 2898 AD, మారుతీ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న స్పిరిట్ కూడా అతని వద్ద ఉంది. దీంతోపాటు ప్రభాస్ కొత్త స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సాలార్ 2 ఎప్పుడు మొదలవుతుందో పక్కాగా టైం చెప్పలేమన్నారు.
సాలార్ పార్ట్ 1 మొత్తం కథ చాలా పొడవుగా ఉందని, దానిని పూర్తిగా వివరించడానికి రెండు సినిమాలు పడుతుందని వెల్లడించారు. ఓ మీడియో చానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు కెజిఎఫ్(KGF)లో పనిచేయడానికి ముందే తాను సాలార్ స్టోరీ రాశానని కూడా ప్రశాంత్ నీల్ చెప్పడం విశేషం. ప్రభాస్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. దీంతోపాటు తిను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు, రామచంద్రరాజు కూడా నటించారు. విజయ్ కిరగందూర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సాలార్ చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.