»Vijay Devarakondas Family Star Digital Rights Headache For Dil Raju
Family Star: దిల్ రాజుకు తలనొప్పిగా మారిన విజయ్ మూవీ
వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో నిలవడానికి వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిజిటల్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదని తెలిసింది.
Vijay Devarakonda's Family Star Digital Rights Headache For Dil Raju
Family Star: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు మాస్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా వరుస ఫ్లాప్స్ పడడంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ తరుణంలో యాక్షన్ డ్రామాను పక్కనపెట్టి ఫ్యామిలీ డ్రామాలకు ఒకే చెప్తున్నాడు విజయ్. గీతా గోవిందంతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్(Family Star). దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు భారీ చిత్రం, మరో వైపు చిన్నసినిమాలతో పాటు మీడియం రేంజ్ మూవీస్‌ను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ చిత్రం దిల్ రాజు(Dil Raju)కు తలనొప్పిగా మారిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కోవిడ్ తర్వాత థియేటర్ ఆదాయం తగ్గింది. దాంతో నాన్-థియేట్రికల్, హిందీ రైట్స్ మీద ఆధారపడి నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు హిందీ మార్కెట్, డిజిటల్ మార్కెట్లు కూడా పడిపోవడంతో నిర్మాతలకు కష్టంగా మారుతోంది.
ప్రొడ్యూసర్ దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్(Family Star) కూడా అవే కష్టాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్(Amazon), నెట్‌ఫ్లిక్స్(Netflix) ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న మహేష్ బాబు గుంటూరుకారాన్ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఒక్కరోజు తేడాతో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేయనున్నారు. రెండు సినిమాలు ఓటీటీలో నాలుగు వారాల్లో విడుదల కావాలి. గుంటూరుకారాన్ని భారీ రేటుకు కొని, ఫ్యామిలీ స్టార్‌కు కూడా అంతే రేంజ్లో కొనుగోలు చేసి ఒకే సారి విడుదల చేయడం కుదరదు. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ స్టార్‌పై ఆసక్తి చూపడం లేదని సమాచారం.
మరోవైపు అమెజాన్ ప్రైమ్ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్‌ను కొనుగోలు చేసింది. అమెజాన్ కూడా ఫ్యామిలీ స్టార్‌ని కొనుగోలు చేసి అదే నాలుగు వారాల తర్వాత విడుదల చేయలేదు. దీంతో ఫ్యామిలీ స్టార్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదని టాక్. విజయ్ లాంటి హీరో, దిల్ రాజు లాంటి బడా నిర్మాతతో సినిమా డిజిటల్ రైట్స్ కు ఇబ్బందులు తలెత్తడం టాలీవుడ్ పరిశ్రమను షాకింగ్‌కు గురిచేస్తోంది. ఏది ఏమైనా ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం సంక్రాంతి బరిలోనే ఉంటుందని దిల్ రాజు స్పష్టం చేశారు.