Venkatesh welcome to shraddha srinath for saindhav movie
Venky saindhav:విక్టరీ వెంకటేష్ (venkatesh) నటిస్తోన్న ‘సైంధవ్’.. (saindhav) మూవీని శైలేష్ కొలను (sailesh kolanu) తెరకెక్కిస్తున్నారు. సైంధవ్ (saindhav) మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అని గ్లింప్స్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ను మూవీ టీమ్ ప్రకటించింది. శ్రద్దా శ్రీనాథ్.. (shraddha srinath) మనోజ్ఞ పాత్రలో నటిస్తున్నారని హీరో వెంకటేష్ (venkatesh) ట్వీట్ చేశారు. అంతకుముందు రిలీజ్ చేసిన సైంధవ్ (saindhav) గ్లింప్స్ అదిరిపోయాయి.
శ్రద్దా శ్రీనాథ్ (shraddha srinath) ‘జెర్సీ’ మూవీలో నటించారు. తన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘జోడీ’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు చేశారు. అవీ అంతగా ఆకట్టుకోలేదు. కన్నడలో ‘యూ టర్న్’ మూవీ చేశారు. సైంధవ్‌లో (saindhav) అభినయానికి ఆస్కారం ఉన్న రోల్‌ను శ్రద్దా చేస్తున్నారని డైరెక్టర్ శైలేష్ (sailesh) తెలిపారు.
ఫ్యామిలీ హీరోగా పేరుబడిన వెంకీని (venky) మాస్ అంశాలను మెలవించి సైంధవ్ (saindhav) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అభిమానులకు తప్పక నచ్చుకుందని శైలేష్ (sailesh) అంటున్నారు. అంతేకాదు వెంకీ (venky) కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. సైంధవ్ (saindhav) మూవీ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్టణంలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
శైలేష్ కొలను హిట్: ద ఫస్ట్ కేసుతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. హిట్: ద సెకండ్ కేసు.. వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. సైంధవ్ మూవీ కూడా డ్రగ్ మాఫియా చుట్టు తిరుగుతుందని తెలిసింది.