»Ustad Movie Review Starring Sri Simha And Kavya Kalyan Ram
Ustad Movie Review: ఉస్తాద్ మూవీ రివ్యూ
ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు శ్రీసింమా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను అలరించడానికి జోరు పెంచారు. వరుస సినిమాలతో దూసుకోస్తున్నాడు. తాజాగా ఆగస్టు 12న మరో వినుత్నమైన కథ ఉస్తాద్(ustaad movie review) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేర నచ్చిందో తెలుసుకుందాం.
Ustad Movie Review starring Sri Simha and Kavya Kalyan Ram
చిత్రం: ఉస్తాద్ (Ustad Movie Review) బ్యానర్: వరాహి చలన చిత్ర నటీనటులు: శ్రీ సింహా కోడూరి, కావ్య కల్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవిశివ తేజ, సాయి కిరణ్ ఏడిద తదితరులు రచన, దర్శకత్వం: ఫణిదీప్ నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు సినిమాటోగ్రఫి: పవన్ కుమార్ పప్పుల మ్యూజిక్: అకీవ బీ ఎడిటర్: కార్తీక్ కట్స్ ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే విడుదల: 12-08-2023
మత్తు వదలరా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి(MM Kiravani) తనయుడు శ్రీసింహా(Sree simha) హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మొదటి చిత్రంతో అందిరి చూపులు తనవైపు తిప్పుకుని కంటెంట్ ఉన్న సినిమాలతో వరుసగా మన ముందుకు వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే వంటి చిత్రాలతో అలరించి తాజాగా.. ఉస్తాద్(Ustad) చిత్రంతో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ఎలా ఉందో రివ్యూ(ustaad movie review)లో తెలుసుకుందాం.
కథ:
సూర్య(శ్రీ సింహా)కు చిన్నప్పట్నుంచి ఆక్రో ఫోబియా ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలంటే భయం. తనతో పాటు ఆ ఫోబియా కూడా పెరుగుతుంది. అలా చిన్నప్పటి నుంచి చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. వాటిని అధికమించడానికి ఫైలట్ కావాలనుకుంటాడు. విమానం నడపాలని కలలు కంటాడు. తను అనుకున్నది సాధిస్తాడు. ఫైలట్‌గా మొదటిసారి ఫ్లైట్‌ని స్మూత్‌గా హ్యాండిల్ చేయాల్సిన క్లిష్ట పరిస్థితి వస్తుంది. తన బాస్ కెప్టెన్( గౌతమ్ వాసుదేవ్) సారథ్యంలో ఆయన ఫ్లైట్ ల్యాండింగ్ చేయాలి. దీంతో ఒకలాంటి టెన్షన్ ఆయన్ని వెంటాడుతుంది. దాన్ని తొలగించుకునేందుకు, బాస్ తిట్ల నుంచి బయటపడేందుకు సూర్య ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో తన బైక్ ఉస్తాద్ స్టోరీని, తన లవ్ స్టోరీని వెల్లడిస్తాడు. మేఘన(కావ్య కళ్యాణ్ రామ్)తో తన లవ్ స్టోరీ ఎలా సాగింది? దానికి తనకిష్టమైన బైక్ ఉస్తాద్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెండు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ప్రేమని, బైక్‌ని వదిలేసి సూర్య ఫైలట్ ఎందుకయ్యాడు? తన లవ్ పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది:
ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఉన్నారు. అయినా సరే వారి సపోర్ట్ లేకుండా ఎదగలనుకుంటున్నారు శ్రీసింహా. అందుకనే కమర్షల్ కథలను కాకుండా కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్‌లను చేస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలా కొత్త కథలను ఎంపిక చేసుకున్న తరుణంలో కాస్త తడబడుతున్నాడేమో అనిపిస్తోంది. వరుస సినిమాలు చేస్తున్న పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం తన ఖాతాలో లేవు. అలాంటి సమయంలో ఉస్తాద్ అనే మరో కంటెంట్ డ్రివెన్ కథతో వచ్చారు. ఉస్తాద్ అనేది ఆయన బైక్ పేరు. అలాగే మేఘనను ప్రేమిస్తాడు. ఎత్తైన ప్రదేశాలు అంటే భయం. దీనికి తోడు పైలెట్ కావాలనే డ్రీమ్. ఇది కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. దీన్ని డీల్ చేయడంలో డైరెక్టర్ ఫణిదీప్ కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. కథనంలో క్లారిటీ మిస్ అయ్యాడు. దీనికితోడు స్లో నరేషన్ ఓ మంచి కంటెంట్‌ని కిల్ చేసిందని చెప్పొచ్చు. థియేటర్లో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించారు. సినిమా ప్రారంభం నుంచే నీరసం స్టార్ట్ అవుతుంది. మరోవైపు సినిమా ఉస్తాడ్ బైక్ బయోపిక్‌లా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. కానీ ల్యాగ్ ఎక్కువైంది. లవ్ స్టోరీలో కావ్యతో కలిసి మాట్లాడే సీన్లు, ప్రేమ ప్రయత్నాలు కాస్త కొత్తగా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే డైలాగులు, కొంత బోల్డ్ గా సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. లవ్ లెటర్ రాసుకునే తీరు కూడా బాగుంది. ఇక ఫ్రీక్లైమాక్స్ లో బైక్ ఎపిసోడ్, లవ్ ఎపిసోడ్‌కి ముడిపెడుతూ వచ్చే సీన్లో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. తీరా క్లైమాక్స్ లో మాత్రం తేలికగా వదిలేశాడు. దీంతో ఆ కిక్ కంటిన్యూ కాలేదు. ఎలాంటి హై ఫీల్ లేకుండానే క్లైమాక్స్ ముగిసినట్టుగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు:
శ్రీ సింహా నటుడిగా మెప్పించాడు. కొంత పరిణతి కనిపిస్తోంది. హీరోయిజానికి పోకుండా సాధారణ కుర్రాడిలా కనిపించి ఆకట్టుకున్నాడు. సైలెంట్‌గా ఆడియెన్స్ హృదయాలను టచ్ చేశాడు. బైక్‌తో అతని ఎమోషన్ సీన్లలో బాగా నటించాడు. లవ్ సీన్లలోనూ మెప్పించాడు. ఇక మేఘనగా కావ్య మరోసారి మెప్పించింది. లవ్ సీన్లలో బాగా చేసింది. కొంత కామెడీ చేసి నవ్వించింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. హీరో ఫ్రెండ్ పాత్రలో రవి తేజ కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కానీ అన్ని సార్లు వర్కౌట్ కాలేదు. ఇక మిగిలిన నటులంతా వారి పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం:
అకీవ బీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. ఆర్ఆర్ కూల్‌గా ఉంది. పవన్ కుమార్ పప్పుల కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్ లుక్‌లో వేరియేషన్స్ చూపించారు. సహజంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉండే. చాలా వరకు సీన్లకు కత్తెర పడితే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే. కథ డిమాండ్ మేరకు ఇచ్చారు. దర్శకుడు ఫణిదీప్ రాసుకున్న కథ బాగుంది(Ustad Movie Review). కానీ దాన్ని అంతే బాగా, అంతే అందంగా, అంతే ఎమోషనల్‌గా, అంతే ఫీల్‌గుడ్‌గా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు.