»Ustad Bhagat Singh Started Has Harihara Veeramallu Stopped Inbox
Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షురూ.. ‘హరిహర వీరమల్లు’ ఇక లేనట్టే!?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి ఫుల్లు ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇటీవలె మొదలైన తమిళ బ్లాక్ బస్టర్ 'వినోదయ సీతమ్' రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి కంప్లీట్ చేసేశారు పవన్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జులై 28న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వినోదయ సీతమ్ రీమేక్ కోసం.. తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసేశారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ సందర్భంగా ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అంటూ సంబరపడిపోయారు హరీష్ శంకర్. ఇక ఈ సినిమా ఓ షెడ్యూల్ అయిపోగానే.. వెంటనే సుజీత్ ‘ఓజి’ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు పవన్. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు ఆగిపోయినట్టేనని.. ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ‘హరి హర వీరమల్లు’ నుంచి చాలా రోజులుగా ఎటువంటి అప్డేట్ లేదు. దర్శకుడు క్రిష్ నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేదు. తన తర్వాత అనౌన్స్ అయినా ప్రాజెక్ట్స్ షూటింగ్‌లు కంప్లీట్ చేసుకుంటున్నా.. క్రిష్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయడం లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. హరిహర వీరమల్లు ఆర్థిక కష్టాల్లో ఉందని.. ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే అటకెక్కిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ నిర్మాత ఏఎం రత్నం మాత్రం వీలైనంత త్వరగా.. హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నారట. అయినా ఇప్పట్లో ఈ సినిమా రీస్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. అయినా కూడా.. ఈ గ్యాప్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట పవన్. ఈ లెక్కన మిగతా సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు.. హరిహర వీరమల్లు పూర్తయ్యే ఛాన్సేస్ తక్కువ. ఈలోపు పవన్ రాజకీయంగా బిజీ అవుతారు కాబట్టి.. హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా.. లేదా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి వీరమల్లు పరిస్థితేంటో వాళ్లకే తెలియాలి.