కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్(France) లో అట్టహాసంగా ప్రారంభమైంది. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ నెల 27 వరకు జరగనున్నాయి.
Urvashi Rautela :కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్(France) లో అట్టహాసంగా ప్రారంభమైంది. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ప్రతేడాది జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సినీ తారలు, మోడళ్లు(Models), డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్(Red carpet) పై ఒంపుసొంపులతో హొయలు పోతుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) రోజుకో వెరైటీ డ్రస్సులో అందరినీ ఆకర్షిస్తోంది. మొదటి రోజు పింక్ టల్లే గౌను ధరించి మెడలో మొసలి నెక్లెస్, చెవులకు మొసలి రింగులు పెట్టుకుని అందంగా దర్శనమిచ్చింది.
అయితే ఆమె ధరించిన ఆభరణాలు నకిలీవి అంటూ నెట్టింట పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. దీంతో ఈ విషయంపై ఆమె టీమ్ స్పందించింది. ఊర్వశి రౌటేలా ధరించిన ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని.. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుందని.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం అని పేర్కొంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశర్చపోతున్నారు. మరికొందరేమో ఈ విషయాన్ని నమ్మకుండా సెటైర్లు పేలుస్తున్నారు. అంత సీన్ లేదు, జోక్ బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఊర్వశి రౌతేలా ఇప్పటి వరకు నాలుగు సార్లు హొయలొలికించింది. తొలి రోజు నుండి అదిరిపోయే ఔట్ఫిట్స్తో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.