వివాహమైన ఏడాదిలోనే యువ నటి భర్త గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగ (Shruti Shanmuga) ప్రియ భర్త అరవింద్ శేఖర్ హార్ట్ చనిపోయారు. ఆయన వయసు 30 ఏళ్లు. బాడీ బిల్డర్ అయిన శేఖర్, శృతి కొన్నాళ్ల డేటింగ్ అనంతరం గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. వాణి రాణి(Vani Rani), కల్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ లాంటి సీరియల్స్ లో నటించింది శృతి. సీరియల్స్ చేస్తున్న క్రమంలోనే బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్ (Arvind Shekhar) తో ప్రేమలో పడి, ఇద్దరు కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు.
ఇక గతేడాది మే నెలలో ఈ ప్రేమ జంట పెళ్లి(wedding)తో ఒక్కటైయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీరు చేసే రీల్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఫుల్ గానే ఉంది. అయితే శృతి భర్త అరవింద్ శేఖర్ గుండెపోటు(heart attack)తో హఠాన్మరణం చెందారు. దాంతో గుండెలు పగిలేలా ఏడ్చారు శృతి. పెళ్లైన ఏడాదికే భర్త చనిపోవడం.. చూపరులను కూడా కంటతడి పెట్టిస్తోంది. కాగా.. ఇంత చిన్న వయసులోనే అరవింద్ మరణం బాధాకరమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు.