మధ్యప్రదేశ్ భోపాల్(Bhopal)కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడికి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డర్(Food order)లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంది. అయితే తీరా ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక సదరు మాజీ క్యాన్సిల్ చేశాడు. ఇలా మూడుసార్లు జరిగింది. దీంతో జొమాటో(Zomato) జోక్యం చేసుకుంది. అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి’ అని ట్వీట్ చేసింది.
దయచేసి ఎవరైనా అంకిత (Ankita) ఖాతాలో క్యాష్ ఆన్ డెలివరీని బ్లాక్ చేసినట్లు చెప్పగలరని తెలిపింది. ఆమె ఈ విషయం తెలియక ప్రయత్నిస్తోందని పెర్కొన్నారు. కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. దీనికి లక్షలాది వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి.అయితే, అంకిత తన మాజీ కోసం అలాంటి ఆర్డర్(Order)పెట్టినది నిజం? కాదా? లేక, ఇది జొమాటో ప్రత్యేక మార్కెటింగ్ టెక్నికా? అని కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు.నీ ఫ్రెండ్‌కు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవద్దని సూచించింది. ఈ మేరకు జొమాటో తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ ద్వారా సదరు కస్టమర్‌ను అభ్యర్థించింది.