»Telugu Indian Idol Season 2 Start Streaming On Aaha
Telugu Indian Idol 2 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్టార్ట్..’ఆహా’లో స్ట్రీమింగ్
తెలుగు ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్ 'ఆహా'(AHA) తన హవాను కొనసాగిస్తోంది. కొత్త సినిమాలు, కొత్త షోలు, కొత్త సిరీస్‌లతో 'ఆహా' ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol), అన్ స్టాపబుల్(Unstoppable), చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ షోలకు కొనసాగింపుగా సీజన్ 2(Season 2)లు పుట్టుకొస్తున్నాయి. కొత్త సీజన్ లను గ్రాండ్ గా ఈ ఫ్లాట్ ఫామ్ తెరకెక్కిస్తోంది.
తెలుగు ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్ ‘ఆహా'(AHA) తన హవాను కొనసాగిస్తోంది. కొత్త సినిమాలు, కొత్త షోలు, కొత్త సిరీస్‌లతో ‘ఆహా’ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol), అన్ స్టాపబుల్(Unstoppable), చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ షోలకు కొనసాగింపుగా సీజన్ 2(Season 2)లు పుట్టుకొస్తున్నాయి. కొత్త సీజన్ లను గ్రాండ్ గా ఈ ఫ్లాట్ ఫామ్ తెరకెక్కిస్తోంది.
తాజాగా ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) అంటూ లోకల్ సింగర్స్ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తోంది. ఈ సరికొత్త షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ షో ద్వారా చాలా మంది సింగర్స్ పరిచయం అయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1(Season 1) అద్భుతమైన సక్సెస్ ను అందుకోవడంతో సీజన్ 2కు ఆడిషన్స్ నిర్వహించి అనేక మంది సింగర్స్(Singers)ని ఈ షో పరిచయం చేయనుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2(Telugu Indian Idol 2)కు సింగర్ హేమచంద్ర హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు వ్యవహరించనున్నారు. సింగర్ గీతామాధురి(Singer Geetha madhuri) మొదటి సారి జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీ(AHA OTT)లో స్ట్రీమ్ అవుతోంది.
మొదటి ఎపిసోడ్ కొత్త సింగర్స్ తో ఎంతో వినోదబరితంగా సాగింది. ప్రతి శుక్ర, శనివారాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2(Telugu Indian Idol Season 2) ఎపిసోడ్స్ ను ‘ఆహా’లో చూడొచ్చు. మార్చి నుంచి ఆహా ఓటీటీ(AHA OTT) రూ.299కే అందిస్తున్నారు. దీంతో మరింత మంది ఆహా ఓటీటీ(AHA OTT)ని సబ్ స్కైబ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సీజన్ కూడా గత సీజన్ లాగే హిట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
అదిరిపోయే పెరఫార్మన్సెస్ , అన్ లిమిటెడ్ ఫన్ , ఎక్సయిటింగ్ మ్యూజిక్… మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ మీ ముందుకు వచ్చేసింది… ఎపిసోడ్ 1 వెంటనే చూసేయండి….#Teluguindianidol2 – Every Friday-Saturday, only on aha… ▶️https://t.co/vyzYisAfQXpic.twitter.com/21ivogEpdf