»Lavanya Tripathi Gave Clarity On The Marriage News
Lavanya Tripathi: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్(Tollywood)లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లిపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్(Tollywood)లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లిపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. 2023లో కచ్చితంగా లావణ్య త్రిపాఠికి పెళ్లి జరుగుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సంవత్సరం వరుణ్ తేజ్‌కు లావణ్య త్రిపాఠికి వివాహం(Marriage) జరుగుతుందని పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్నాయి.
ఆ వార్తలన్నింటికీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారని తెలిపింది. ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావడం లేదని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా తన పెళ్లి గురించి మాట్లాడుతానని క్లారిటీ ఇచ్చింది. తన తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదని, ఆ విషయంలో తాను అదృష్టవంతురాలినని తెలిపింది.
తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు అయ్యిందని, ఇంకా తాను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సమయం ఉందని తెలిపింది. ప్రస్తుతానికి తనకు పెళ్లిపై ఆసక్తి లేదని, ఇంకా అనేక సినిమాల్లో నటించనున్నట్లు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) వెల్లడించింది. తన మనసంతా ఇప్పుడు పని మీదే ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా అనేక ప్రాజెక్టులు చేస్తానని తెలిపింది.