ఈ దీపావళికి బడా బడా స్టార్ హీరోలు సాలిడ్ అప్టేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(vijay) అంతకు మంచి అనేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ నటిస్తున్న ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ ‘వారసుడు'(varasudu) నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణంలో.. విజయ్ హీరోగా తెలుగు, తమిళ్లో తెరకెక్కుతోంది వారసుడు.
విజయ్ నటించిన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయడంతో.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి అభిమానులు. వచ్చే సంక్రాంతికి వారసుడుని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో దీపావళికి వారసుడు ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. తాజాగా ఈ పాటకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్టేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వారసుడు ఆల్బమ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే రిలీజ్‌కు రెడీ అవుతున్న పాటను విజయ్‌తో పాడించాడట తమన్. ఆ పాట ‘రంజితమే ఏ రంజితమే’ అ సాగుతుందట. జోనితా గాంధీతో కలిసి విజయ్ ఈ పాటను పాడినట్టు సమాచారం. తమన్ ట్యూన్ కూడా అదిరిపోయేలా ఉన్నట్టు టాక్. దాంతో విజయ్ అభిమానులకు పండగేనని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరి వారసుడు ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.