Bellamkonda srinivas: మరోసారి పోలీసుగా బెల్లం కొండ హీరో..!
బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్(Bellamkonda srinivas) టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాడు. కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు కొట్టేలేకపోయాడు. జయజానకీ నాయక, రాక్షసుడు మాత్రమే అంతమాత్రంగా హిట్ సాధించాయి. కాగా, ఆయన, ఇటీవల బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా అరంగేట్రం చేశాడు. కానీ, అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ తెలుగులోకి వచ్చేశాడు.
బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్(Bellamkonda srinivas) తాజాగా తెలుగులో ఓ సినిమాని లైన్ లో పెట్టాడు. ఈ సారి బెల్లంకొండ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ కి దర్శకత్వం వహించిన దర్శకుడు సాగర్ చంద్రతో చేతులు కలిపారు. ఈ చిత్రం యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. దర్శకుడు, శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త లుక్, క్యారెక్టర్లో ప్రజంట్ చేయనున్నారు. BSS10 ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ ఈరోజు ప్రత్యేక అతిథులతో BSS10 మూవీ ఆఫీస్‌లో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైయింది. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి, దర్శకుడు పరశురాంతో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.
దీనికి టైసన్ నాయుడు టైటిల్ పరిశీలనలో ఉంది. ఫిలిం ఛాంబర్లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇది పోలీస్(police) బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. బెల్లం హీరో ఇప్పటిదాకా రెండు సార్లు ఖాకీ యునిఫార్మ్ వేసుకున్నాడు. మొదటిసారి కవచంలో కనిపిస్తే ఫెయిల్యూర్ ఎదురయ్యింది. తర్వాత రాక్షసుడు రూపంలో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోలీస్ దుస్తులు వేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా చాలా సీరియస్ గా సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, జిమ్షీ ఖలీద్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, మల్లికార్జున్ చెంచి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.