గూగుల్ క్రోమ్ యూజర్లు లేటెస్ట్ వెర్షన్ అప్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే సైబర్ నేరగాళ్లు డేటా తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
CERT-In issues high-severity vulnerability warning for Google Chrome
Google Chrome: గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లు పాత క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్ డేట్ చేసుకోండి.. ఈ విషయాన్ని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది. క్రోమ్ బ్రౌజర్లో లోపాల వల్ల కంప్యూటర్ సైబర్ నేరగాళ్ల రిమోట్‌గా యాక్సెస్ కావొచ్చని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సెన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) హెచ్చరించింది.
గూగుల్ క్రోమ్ విండోస్ వెర్షన్ 118.0.5993.70/.71 మ్యాక్, లైనక్స్ వెర్షన్ 118.0.5993.70 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తోన్న వారికి ముప్పు ఉందని సెర్ట్ ఇన్ పేర్కొంది. ఆయా బ్రౌజర్లలో లోపాల వల్ల రియోట్గా దాడి చేసే వ్యక్తి సిస్టమ్‌లోకి ఆర్బిట్రరీ కోడ్ పంపించి, సర్వీస్ తిరస్కరించడం, అందులో గల సున్నిత సమాచారం బయటపెట్టే ప్రమాదం ఉందని తెలిపింది. వెంటనే గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
గూగుల్ క్రోమ్ ఏ వెర్షన్ వాడుతున్నారో తెలుసుకోవాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ అబౌట్ క్రోమ్ అని కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేస్తే బ్రౌజర్ ప్రస్తుత వెర్షన్‌తోపాటు అప్ డేట్ అయ్యిందా లేదా అనేది కనిపిస్తోంది. బ్రౌజర్ అప్ డేట్ కాకుంటే చేసి.. రీ లాంచ్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ అయ్యి ఉంటే క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్ అని చూపిస్తోంది.