WhatsApp: వాట్సాప్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అది కేవలం ఫ్రెండ్స్‌తో చాటింగ్ వరకే కాదు బిజినెస్‌కు కూడా ఉపయోగపడుతుంది. దానికి తగ్గట్టుగానే వినియోగదారుల కోసం ఎప్పటి కప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా ఒక కొత్త సేవను అందుబాటులోకి తీసుకు రాబోతుంది. యూజర్ల సౌకర్యార్థం ఏఐ టెక్నాలజీతో ఫిర్యాదులు, సందేహాలను పరిష్కరించబోతోంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఫిర్యాదులు, ప్రశ్నలకు తక్షణ స్పందన లభించనుంది. అన్ని వెర్షన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. 24 గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చాటింగ్ ద్వారా మీ సమస్య పరిష్కారం అవకపోతే నేరుగా కాల్ చేసి మాట్లాడే వెసులబాటును కల్పించనుంది.