కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Hero vijay) కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి దాతృత్వం చాటుకున్నరు.టెన్త్, ఇంటర్ పాసైన విద్యార్థులకు (Students) ఒక్కో విద్యార్థికి రూ. 10, 000 చొప్పున సాయం చేస్తానని ఆయన ప్రకటించాడు. విజయ్ అందరికీ సుపరిచితుడే. తమిళ ఇండస్ట్రీ(Tamil Industry)లో కాదు ఆయనకు ఎక్కడ చూసిన ఫ్యాన్ పాలోయింగ్ (Fan following) ఎక్కువ ఉంది. విద్యార్థులకు చేయూత ఇవ్వడానికి విజయ్ ముందుకు వచ్చారు. అందులో భాగంగా “విజయ్ మక్కల్ ఇ యక్కం(Makkal e Yakkam)” తరపున ఒక్కో విద్యార్థికి రూ. 10,000 సాయం చేయనున్నట్లు వెల్లడించారు. హీరో విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్ (Kollywood) ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక, విద్యార్థుల సమాచారం సేకరించాలని విజయ్ తన ఫ్యాన్స్‌కు ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ఈనెల 17వ తేదీన నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం (Financial assistance) చేయడానికి నిర్ణయించుకున్నట్లు విజయ్ తెలిపాడు