మహబూబ్‌నగర్ (Mahbubnagar) పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ (Charitable Trust) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ (Skill development) సెంటర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) భూమిపూజ చేశారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్ (Migration) అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్ అంటే ఇరిగేషన్ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd) తో కలిసి అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ డబ్బులు చాలా మందికి ఉండవచ్చు కానీ.. మంచి చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆరు లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించి, వారు పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తమకు ఎంతో ఆనందమని చెప్పారు. పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పెట్ (Red carpet) పరుస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ మీదేనని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. ఉపాధి అవకాశాలు అందేలా ఉంటాయి.. స్కిల్ సంపాదించాలని సూచించారు. నాడు పారిశ్రామిక వేత్తలు (Industrialists) ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన దుస్థితి వాస్తవం కాదా..? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది.. మరి ఈ అంశాలను వేడుకలా చేసుకోవద్దా అని అన్నారు. హైదరాబాద్ మారింది వాస్తవం కాదా? 24 గంటల కరెంటు ఉండటం వాస్తవం కాదా? అని అన్నారు.