Mahaboobnagar: పాలమూరు జిల్లాలో విజృంభిస్తున్న చికెన్ గున్యా.. భయాందోళనలో ప్రజలు
మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటి మధ్యే మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ గున్యా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ గున్యా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది. చికెన్ గున్యా వ్యాధి బారిన పడిన రోగులతో హా
Mahaboobnagar: మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటి మధ్యే మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ గున్యా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ గున్యా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది. చికెన్ గున్యా వ్యాధి బారిన పడిన రోగులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. చికెన్ గున్యా కేసులు ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లా పరిసరాల్లోనే నమోదు అవుతున్నాయి. విష జ్వరాల కారణంగా ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. చికెన్ గున్యాతో సంబంధించిన కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పెరిగిపోతున్నట్లు వైద్యులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.
మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్జిల్ లో విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో చికెన్ గున్యా బాధితులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. అకాల వర్షాల కారణంగా ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో పెద్దల కన్నా చిన్న పిల్లలే చికెన్ గున్యా బారిన పడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. విపరీతమైన తల నొప్పి, కండరాల నొప్పులతో పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. అకాల వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులే జ్వరాలకు మరో కారణం అంటున్నారు వైద్యులు. జ్వరం రావడంతో డోలో మాత్రలు వాడుతున్నారని, ఆ తర్వాత నరాల నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రులకు జనాలు పరుగులు పెడుతున్నారు. చికెన్ గున్యా బారిన పడుతున్న వారు ఎక్కువగా మిడ్జిల్ ప్రాంత వాసులే కావడం విశేషం. వారినుంచి ప్రస్తుతం అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు.