»Tamannaah Sensational Comments On This South Industry
Tamannaah: సౌత్ నుంచి వెళ్లి ఇదే ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు
సౌత్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా..ఇదే ఇండస్ట్రీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది తెలిసిన పలువురు తమన్నా బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఇలా కామెంట్లు చేయడం సరికాదని అంటున్నారు.
tamannaah Sensational comments on this South industry
సౌత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుని నార్త్‌కు వెళ్లిన హీరోయిన్ తమన్నా సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలో ప్రధానంగా హీరోయిజమే ఎక్కువ చూపిస్తారని తెలిపింది. అది తెలిసి క్రమంగా అలాంటి సినిమాల్లో పాత్రలు చేయడం మానేశానని చెప్పుకొచ్చింది. పురుషాధిక్యతని చాటే సినిమాల్లో భాగం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే తమన్నాకు బాలీవుడ్లో వచ్చినంత పేరు సౌత్‌లో రాలేదు. ఈ అంశంపై ఆమె కూడా స్పందించారు.
తాను సక్సెస్‌ని తీసుకోనని వ్యక్తిగతంగా ఫ్లాప్ అయ్యానని తమన్నా వెల్లడించింది. బాలీవుడ్లో మొదట్లో చేసిన సినిమాలు వర్కవుట్ కాకపోయినా.. అది తన డ్రీమ్‌గా భావించి నటిస్తూనే ఉందని చెప్పింది. “చాలా మంది సినిమాలకు పని చేయడం వల్ల నేను దానిని వ్యక్తిగత వైఫల్యంగా ఎప్పుడూ భావించలేదని పేర్కొంది. నటన తన ప్యాషన్ అని కెమెరా ముందుకి వెళ్లడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ఎలా ఉన్నా, తమన్నా కెరీర్ దక్షిణాదిలో స్టార్ హీరోలతో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.