పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ రివీల్ అయింది. తమన్ అదిరిపోయే అప్డేట్ రెడీ చేస్తున్నాడు.
ఒక అభిమానిగా పవన్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకుమించి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడు సుజీత్. సాహో తర్వాత పవన్‌తో ఛాన్స్ అందుకున్న సుజీత్.. ఓజి సినిమాను ముంబై బ్యాక్ డ్రాప్లో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తన అభిమాన హీరోకి సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఇక హంగ్రి చీతా అంటూ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది.
అయితే.. దీని తర్వాత ఓజి నుంచి పెద్దగా అప్డేట్స్ బయటికి రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా సినిమాటోగ్రఫర్ రవిచంద్రన్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ.. హంగ్రీ చీతా నుంచి సంథింగ్ స్పెషల్ ఎగ్జైటింగ్ అప్డేట్ వస్తుందని రాసుకొచ్చాడు. దీంతో ఓజి నుంచి రాబోయే ఆ సాలిడ్ ట్రీట్ ఏంటనేది ఎగ్జైటింగ్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఓజి నుంచి థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ థీమ్ సాంగ్‌ను ‘బ్రో’ సినిమా థీమ్ సాంగ్‌కు మించి కొట్టాడట తమన్.
దీంతో మరోసారి ఓజి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవడం గ్యారెంటీ. ప్రస్తుతానికైతే.. పవన్ ఫ్యాన్స్ ఓజి అప్డేట్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి ఓజి ఎలా ఉంటుందో చూడాలి.