RGV: కొత్తమ్మాయిపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇంకో జీవితం బలి!
అసలు వర్మ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఏం చేసినా అందులో కాంట్రవర్శీ ఉండాలి. లేకుంటే వర్మకు నిద్ర పట్టదు. అందుకే గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీతోనే కాపురం చేస్తున్నాడు వర్మ. ఇక కొత్త హీరోయిన్లను పట్టడంలో వర్మ తర్వాతే ఎవ్వరైనా. తాజాగా ఓ కొత్తమ్మాయి పై వర్మ కళ్లు పడ్డాయి.
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా బండి లాగిస్తున్నాడు వివదాల రామ్ గోపాల్ వర్మ. అలాగే అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా చిందులేస్తు ఎంటర్టైన్ చేస్తుంటాడు. వొడ్కా విత్ రామ్ అంటూ చేసే ఇంటర్య్వూలు మామూలుగా ఉండవు. అయితే వర్మ ఎంత కాంట్రవర్శీ చేసినా.. హీరోయిన్ల విషయంలో అతని టేస్టే వేరు. ఇప్పటి వరకు వర్మ ఎంతోమంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇన్స్టాలో ఎవ్వరైనా అమ్మాయి నచ్చితే చాలు.. ఎవరా పిల్లా? ఏం చేస్తుంది? సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా? అని ఆరా తీస్తున్నాడు.
తాజాగా ఓ మళయాళి బ్యూటీ వర్మ కళ్లలో పడింది. ఎప్పటికప్పుడు కొత్త అందం కోసం చూసే రామ్ గోపాల్ వర్మ, లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ పోస్ట్ చేసాడు. వర్మ పోస్ట్ చేసిన వీడియోలో ఆ అమ్మాయి సారీ కట్టుకోని, ఒక కెమెరా పట్టుకోని.. చాలా అందంగా ఉంది. అయితే వర్మ మెచ్చిన బ్యూటీ కావడంతో.. వర్మ అలా అమ్మాయి గురించి పోస్ట్ చేసాడో లేదో.. వెంటనే ఆ అమ్మాయి అసలు పేరుతో అడ్రస్ కూడా పెట్టేశారు నెటిజన్స్.
ఆమె పేరు ‘శ్రీలక్ష్మి సతీష్’ అని.. ఇన్స్టా మోడల్ అని, కేరళకి చెందిన అమ్మాయి అంటూ ఫుల్ డీటైల్స్ ఇచ్చేసారు. దీంతో Hey Sreelakshmi, https://instagram.com/f_a_r_f_a_l_l_a?igshid=MzRlODBiNWFlZA== If you are interested in acting , can you please send me a D M అని వెంటనే పోస్ట్ చేసేశాడు. హే శ్రీలక్ష్మీ నీకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే.. డైరెక్ట్ మెసేజ్ చేయమని పోస్ట్ చేసేశాడు. దీంతో ఈ అమ్మాయికి కూడా బ్రేక్ ఇస్తావా? ఇంకో జీవితం బలి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ కేరళ కుట్టిని వర్మ హీరోయిన్గా బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.