సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువా విడుదల తేదీ ఖారారైనట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లోనే రిలీజ్ చేయనున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే అదే సమయంలో కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 కూడా ఉండటం ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది.
తమిళ్ స్టార్ హీరో సూర్య(suriya)యాక్ట్ చేస్తున్న నెక్ట్స్ మూవీ కంగువా(kanguva) చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ ఏప్రిల్ 11, 2024న విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నైలో ఇటివల ప్రారంభమైన నేపథ్యంలో ఈ సమాచారం వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూర్య అభిమానులు సినిమా విడుదల తేదీని ప్రకటించమని మేకర్స్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ఈ మూవీ నుంచి జూలైలో విడుదలైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో కమల్ హాసన్(kamal Haasan)కి స్టార్ సూర్య బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దర్ స్టార్ హీరోల చిత్రాలు కూడా ఒకే సారి తేదీలు క్లాష్ అవుతాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలనే భారతీయుడు 2 చిత్రం ఏప్రిల్ 2024లో విడుదలవుతుందని పుకార్లు వచ్చాయి.
అయితే ఇండియన్ 2(indian 2) రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుండగా..మొదటి భాగాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండవ భాగం ఇండియన్ 3 దీపావళికి విడుదల చేయాలని షెడ్యూల్ చేశారు. మరి ఈ మూవీ రిలీజ్ తేదీపై ఇండియన్ 2 టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే తేదీకి వస్తారా లేదా రిలీజ్‌ని ఒక వారం లేదా రెండు రోజులు వాయిదా వేస్తారా అనేది కొన్ని రోజుల తర్వాత తేలిపోనుంది. మరోవైపు భారతీయుడు 2 విడుదల తర్వాత మాత్రమే శంకర్ గేమ్ఛేంజర్పై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.