Sukumar: సుకుమార్ నెక్స్ట్ హీరోలు.. ఈ తండ్రి కొడుకులేనా?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో చర్చ జరుగుతునే ఉంది. లేటెస్ట్గా ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరితో ఒకరితో ఉంటుందని అంటున్నారు.
Sukumar: పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో దుమ్ములేపిన సుకుమార్.. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2తో బిజీగా ఉన్నాడు. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ సినిమా వెయ్యి కోట్లు టార్గెట్‌గా రాబోతోంది. దీంతో పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. పుష్ప2 రిలీజ్ అయితే గానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. ఉంటే పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు తక్కువ. అందుకే.. అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో సుకుమార్ నెక్స్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ చాలా కాలంగా రంగస్థలం కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ.. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టుగా వినిపిస్తునే ఉంది. లేటెస్ట్గా మరోసారి ఈ సూపర్ కాంబో దాదాపుగా ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
కానీ ఇప్పటికే చరణ్, బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. త్వరలోనే ఆర్సీ 16 షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. లేదంటే.. మెగాస్టార్ చిరంజీవితో సుక్కు సినిమా ఉండే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. గతంలోనే మెగాస్టార్, సుకుమార్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరడం లేదు. ఫైనల్‌గా పుష్ప2 తర్వాత చిరు, సుక్కు సినిమా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. లేదంటే.. రంగస్థలం సినిమాకు మించి చరణ్‌తో ప్రాజెక్ట్ చేయడం పక్కా అంటున్నారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలోనే ఎవరో ఒకరితో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!