»Star Heroine Nithya Menon Soonly Going To Marry Top Business Man
Nithya Menon: పెళ్లి చేసుకోబోతున్న పవన్ కల్యాణ్ హీరోయిన్
పెళ్లిపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరగనుందట. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటారని తెలిసింది.
Nithya Menon: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ(film industry)లో స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. టాలీవుడ్(Tollywood)-బాలీవుడ్(Bollywood)-కోలీవుడ్(Kollywood)-మాలీవుడ్ ఇండస్ట్రీ(Mollywood industry )కి చెందిన స్టార్ సెలబ్రిటీలంతా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు…ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) – హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripati) కూడా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అంతేకాదు బుల్లితెరకు చెందిన కొందరు తారలు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ కూడా పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.
మాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం హీరోయిన్ నిత్యా మీనన్(Nithya Menon) త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లాడబోతోంది. అంతేకాదు వీరి నిశ్చితార్థానికి తేదీ కూడా ఫిక్స్ అయింది. నిశ్చితార్థం తర్వాత నిత్యామీనన్ మీడియా ద్వారా అధికారికంగా పెళ్లి విషయాన్ని అభిమానులకు చెప్పేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో నిత్యా మీనన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు నిత్యా మీనన్ కాబోయే భర్త ధనవంతుడని.. బిజినెస్ పరంగా నెంబర్ వన్ అని.. కోట్ల ఆస్తులున్న వన్ అండ్ ఓన్లీ కొడుకు అని తెలుస్తోంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత నిత్యా మీనన్ సినిమాలు చేస్తుందా..? లేదా..? అని అభిమానులు ఆలోచిస్తున్నారు..!!