KNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ ఓటరు కార్డు లేకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు పాసుబుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు, పింఛన్ కార్డు, తదితర గుర్తింపు కార్డులు చూపించి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.