MDK: ఓటరు ఐడీ లేకపోయినా, ఎన్నికల సంఘం అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డులు సహా 18 ఐడీలు చెల్లుబాటవుతాయని తెలిపారు.