ADB: ఇప్పటివరకు 38 గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించిన ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు వేయాలని ఆయన సూచించారు. గొడవలకు, అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు వినియోగించి ఇళ్లకు చేరాలి. ప్రశాంత వాతావరణంలో ఎనికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.