NLR: గుడ్లూరు మండలం మోచర్ల సమీపంలో బుధవారం జాతీయ రహదారిపై లారీ టైర్ బరస్ట్ కావడంతో అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. డ్రైవర్ పెరుమాల్ (47) లారీలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం వల్ల రోడ్డు కొన్ని గంటలు బంద్ అయ్యింది, వాహనాల రవాణాకు అసౌకర్యం ఏర్పడింది.