SSMB 28 : బడా హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే బిజినెస్ డీల్స్ భారీగా జరిగిపోతున్నాయి. ఇక క్రేజీ కాంబినేషన్ అయితే.. పోటీ పడి మరీ థియేట్రికల్, నాన్ థియేట్రిక్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇక ఓటిటి సంస్థలైతే నువ్వా నేనా అంటున్నాయి.
బడా హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే బిజినెస్ డీల్స్ భారీగా జరిగిపోతున్నాయి. ఇక క్రేజీ కాంబినేషన్ అయితే.. పోటీ పడి మరీ థియేట్రికల్, నాన్ థియేట్రిక్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇక ఓటిటి సంస్థలైతే నువ్వా నేనా అంటున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. 80 కోట్లకు పైగా ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టు టాక్. ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్.. ఎస్ఎస్ఎంబీ 28 డిజిటల్ రైట్స్ దక్కించుకుందని అంటున్నారు. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ మొత్తానికి నైజాం రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం దాదాపు 50 కోట్లనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ హక్కుల కోసం భారీ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్‌ను 24 కోట్లకు కోట్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో యుఎస్ఏ హక్కులు 16 కోట్లని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో షూటింగ్ స్టేజ్‌లోనే ఎస్ఎస్ఎంబీ 28.. భారీ బిజినెస్ చేసేలా ఉందంటున్నారు. అయితే ఇలాంటి లెక్కల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే.. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.