Mahesh-Thrivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగుతోంది. కానీ నెక్స్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ ఉండడంతో.. స్పీడ్ పెంచాడు మహేష్.
అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12ఏళ్లకి మళ్ళీ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. అందుకే ఈసారి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా సంకేతం ఇచ్చేసింది. మిర్చి యార్డులో బీడితో నడిచి వస్తున్న మహేష్ ఫోటో.. సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో మిర్చి యార్డులో భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తంగా మహేష్, త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ ఒకటి.. ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. అది కూడా తండ్రీ కొడుకుగా నటిస్తున్నాడట. తండ్రిగా మహేష్ గెటప్ ఓ రేంజ్లో ఉంటుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఫాదర్ రోల్ రివీల్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ పుకార్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. మహేష్ డబుల్ రోల్ చేస్తే మాత్రం.. ఖచ్చితంగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం అనడంలో సందేహం లేదు. మరి ఎస్ఎస్ఎంబీ 28 ఎలా ఉంటుందో చూడాలి.