అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి శ్రీలీలకు తనకు ఉన్న బంధుత్వం గురించి బయట పెట్టారు.
Sree Leela: యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. తన నటన, డ్యాన్స్, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘భగవంత్ కేసరి’లో నటించింది. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో హీరో బాలకృష్ణకు కుమార్తెగా కనిపించనుంది. అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వూలో తనకు, శ్రీలీలకు ఉన్న బంధుత్వం గురించి చెప్పారు.
శ్రీలీల కుటుంబానికి అనిల్‌కి ఉన్న సంబంధాన్ని బయటపెట్టాడు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గర ఉన్న పొంగలూరు. అనిల్ వాళ్ల అమ్మమ్మ ఊరు కూడా అదే అని తెలిపాడు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సోదరి వరుస అవుతుందని తెలిపాడు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుంది. ‘భగవంత్ కేసరి’ సినిమాలో అందరి ముందు అనిల్‌ను డైరక్టర్ గారు అని పిలిచినా.. ఎవరూ లేనప్పుడు మాత్రం మామయ్య అంటూ ఆట పట్టంచేదట. శ్రీలీల అమ్మ స్వర్ణ ఎప్పుడో అమెరికా వెళ్లిపోవడం వల్ల కాంటాక్ట్స్ లేక ఇన్ని రోజులు తెలియలేదని అనిల్ తెలిపారు.