Skanda Movie Explained In Telugu Ram Sreeleela Boyapati Srinu
Skanda Movie Explained: బోయపాటి సినిమా అంటే ఏంటో తెలియాలంటే మొత్తం చూడాలా.. ఒక్క ఫ్రేమ్ చాలాదా అన్నట్లు రామ్ అరుపు, దున్నపోతు ఫైట్ తో స్కంద టైటిల్ పడుతుంది. హైకోర్టు ఏరియల్ షార్ట్ తో సీన్ ఓపెన్ అవుతుంది. పోలీసుల బార్గెట్స్ ను తోసుకొని కొందరు ప్రజలు కోర్టులోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటారు. కోర్టు బయట ఇంత మంది జనం ఉన్నది రుద్రగంటి రామకృష్ణ రాజు కోసం అని ఓ టీవీ జర్నలిస్ట్ చెబుతుంది. ఆయన చాలా మంచి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ చెబుతుండగా.. కొంత మంది ప్రజలు అతను పాపాలు చేశాడు, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు అని మీడియాను అడ్డుకుంటారు. తరువాత సీన్లో రుద్రగంటి రామకృష్ణ రాజు కోర్టు బోనులో నిలబడి ఉంటాడు. ఈ రోజు కోర్టులో ఫైనల్ తీర్పు అని, మీరు పది మంది ఆడవాళ్లను చంపారు, ఆ నేరం బయటపడకుండా ఉండడానికి మరో 25 మందిని చంపించారు అని, వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని ఉరిశిక్ష వేస్తున్నట్లు జడ్జ్ తీర్పు చెబుతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఓ పేషెంట్.. రుద్రగంటి రాజుకు ఉరిశిక్ష అనే వార్త విని హైపర్ అవుతుంది. తన పల్స్ రైజ్ అవుతుంది. దాంతో డాక్టర్స్ చెక్ చేసి టీవీ ఆఫ్ చేస్తారు. తన తండ్రికి ఉరిశిక్ష అన్న న్యూస్ ఈ అమ్మాయి డిస్ట్రర్బ్ చేసిందని డాక్టర్ చెబుతుంది. తరువాత సీన్లో రామ కృష్ఱ కోసం లాయర్ జైలు కు వస్తాడు. అక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్ నీ కూతురు ఆసుపత్రిలో ఉంది జాగ్రత్తగా మాట్లాడు అని వెళ్లిపోతాడు. తప్పు చేయకుండా శిక్ష ఎందుకు ఒప్పుకున్నారు అని లాయర్ అంటాడు. మళ్లీ రీ అప్లికేషన్ కు సైన్ పెట్టండి అంటే తన ప్రాణం కన్నా, తన బిడ్డ ప్రాణం ముఖ్యమని దండం పెడుతాడు. మిమ్మల్ని కాపాడానికి ఆ దేవుడే వస్తాడు అని మాట్లాడుతాడు. టైటిల్స్ పడుతుంటాయి.
చదవండి:Pushpa: నటుడు అరెస్ట్..కారణమిదే
హెలికాప్టర్ షాట్ తో ఈ రోజు అనంతపురంలో రాష్ట్రముఖ్యమంత్రి రాయుడి గారి కూతురి వివాహం జరుగుతుందని ఇక్కడికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు అని మీడియా జర్నలిస్ట్ చెబుతుంది. అక్కడికి వచ్చిన గెస్ట్ లందరిని సీఎం మామ పలకరిస్తుంటాడు. అక్కడికి గవర్నర్ వచ్చి సీఎంకు నమస్కారం పెడుతుంది. సీఎం అందరిని పరిచం చేస్తాడు. తన కూతుర్ని చేసుకునేది తన బావమరిదే అని చెప్తాడు. అదే సీన్లో అక్కడికి తెలంగాణ సీఎం కోడుకు వస్తాడు. అతన్ని గవర్నర్ కు పరిచయం చేస్తాడు సీఎం. ప్రియను కలిసి ఒక్కసారి హాయ్ చెప్పొస్తా అని వెళ్తాడు. తరువాత సీఎం మామకు ఒక వ్యక్తి చేవులో ఏదో చెప్తాడు అతను సిరీయస్ అక్కడనుంచి వెళ్లిపోతాడు. అమ్మాయిగారిని తెలంగాణ సీఎం కొడుకు లేపుకపోయినాడు అని చెప్తాడు. సీఎం మామ అరుస్తాడు. ఇన్నాళ్లు కాపాడుకొచ్చిన పరువు పోయిందని సీఎంతో అంటాడు. దానికి పరువు పోదూ అని మామ మెడను విరిచి చంపేస్తాడు. తన మామ చనిపోయాడు అని, పెళ్లిజరగదు అని అందరికి చెప్తాడు సీఎం. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయి నిలబడుతారు. సీఎం నమస్కారం పెట్టగానే అందరూ వెళ్లిపోతారు. సీఎం దగ్గరకు వచ్చిన బమ్మర్దితో తెలంగాణ సీఎంకు ఫోన్ చేయి అంటాడు రాయుడు.
తరువాత సీన్లో తెలంగాణ సీఎం గ్రీన్ టీ కలుపుతుంటాడు. అక్కడే నవీన్ బాయ్ మందుతాగుతుంటాడు. అతన్ని వదిలేయండి అని డీజీ సీఎంతో అంటుంటాడు. మనం ఎదగడానికి ఉపయోగపడినోడు మనం నెత్తిమీదనే చేయివేస్తే ఊరుకోవాలా అని, తన తమ్ముడు సంజయ్ కి చెప్పి చంపమంటాడు. అతను కాల్చడంతో పోలీసులందరు నవీన్ కాల్చి చంపేస్తారు. ఎవడైనా సరే తన అన్నకోసమే బతకాలి లేదా అన్నకోసమే చావాలి అని చెప్తాడు సంజయ్.. అంతలో ఆంధ్ర సీఎం ఫోన్ చేశాడు అని పీఏ ఫోన్ ఇస్తాడు. పెళ్లి బాగా జరిగిందా రాయుడు అంటే… నీ కొడుకును పంపి నా కూతుర్ని లేపుకపోతే పెళ్లి ఎంటా జరుగుద్ది రంజిత్ రెడ్డి అని అరుస్తాడు. అదే సమయంలో ఇంటికి హెలికాప్టర్ వస్తుంది. పరువుకోసం పెంచిన మామనే చంపినా, నీ కొడుకును చంపి సీమ మొత్తానికి విందు ఇస్తా అని సవాల్ విసురుతాడు. రారా నా ఇంటి గేట్ కాదు స్టేట్ టోల్ గేట్ కూడా దాటలేవు అని తెలంగాణ సీఎం కూడా సవాల్ చేస్తాడు. ఇంటికి వచ్చిన తన కొడుకుతో ఒక్క మాట చెప్పాలి కాదా అని అంటాడు. దానికి మా నాన్న ఎవరి మాట వినడు అందుకే నేనే రమ్మని చెప్పినా అని ప్రియా సమాధానం చెబుతుంది. వాళ్లను లోపలికి వెళ్లమని డీజీతో ఏం చెద్దాం అని చెప్తాడు. మీరే చెప్పారు కదా సర్ టోల్ గేట్ దాటనియ్య అని అదే చెద్దాం అని ఆఫీసర్ చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో రాయుడి దగ్గరకు వాళ్ల బమ్మర్ది వచ్చి నువ్వు ఊ అను వాన్ని చంపి ప్రియను ఎత్తుకొస్తా అంటాడు. రొడ్డుమీద తేల్చుకునే పంచాయితీ అయితే మామనెందుకు చంపుకుంటా.. గట్టోన్నే దించాలా.. చాకపుడిని దించు అని చెప్తాడు. హైదరాబాద్ చార్మినర్, స్ట్రీట్ ఫుడ్ విజువల్స్ తో వ్యాన్ లో కొందరు వ్యక్తులు దిగుతారు. వాళ్లను గన్నులు స్మగ్లింగ్ చేసే చోటుకు తీసుకెళ్తాడు ఇన్ఫార్మర్. వాటిని చూసి అసల్ది కావాలి అని అడుగుతాడు. అక్కడికి మరో గన్ ను తీసుకొని సులేమా వస్తుంది. అది కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ ను చంపేస్తుంది అని చెప్తాడు. అది తీసుకొని కిల్లర్ వెళ్లిపోతూ సీఎం ఫ్యామిలీ గురించి అడుగుతాడు. రేపు గౌడిడూడలో సదర్ దానికి సీఎం ఛీఫ్ గెస్ట్ అని ఓ ఇన్ఫార్మర్ చెప్తాడు.
మరో సీన్లో సదర్ హడావిడి మొదలు అవుతుంది. అక్కడ పోలీసులు బందోబస్త్ లో ఉంటారు. అదే సమయంలో కిల్లర్ ప్లాన్ చేస్తాడు. దున్నపోతుకు ఇంజక్షన్ ఇస్తే అది హడావిడి చేస్తుంది. ఆ సమయంలో సీఎంను లేపేస్తా అని అతని మనుషులతో చెబుతాడు. అక్కడి సీఎం తన కొడుకుతో వస్తాడు. బొట్టుపెట్టుకొని కూర్చొని ఉంటారు. గేదేకు ఇంజక్షన్ ఇవ్వడానికి ఒక విలన్ ట్రై చేస్తాడు. అతన్ని దున్నపోతు పొడుస్తుంది. దున్నపోతును తీసుకొని స్కంద వస్తాడు. మెయిన్ దున్ననే పొడిచేయండి అని కిల్లర్ ఫోన్ చేస్తాడు. అక్కడ దున్నపోతుతో స్కంద ఫైట్ చేస్తుంటాడు. అదే సమయంలో సీఎం పై గురిపెడుతాడు. సెక్యూరిటీ అడ్డు వస్తాడు. స్కంద ఫైట్ చేస్తుంటాడు. ఒకడు దున్నపోతుకు ఇంజక్షన్ ఇస్తాడు అదే సమయంలో సీఎంకు కిల్లర్ గన్ గురిపెడుతాడు. కాలుస్తాడు అది వేరొకరికి తాకుతుంది. దున్నపోతు కంట్రోల్ తప్పుతుంది. అదే విషయాన్ని పోలీసు సీఎంకు చెప్పి మనం బయలుదేరితే మంచిది సర్ అని చెప్తాడు. గురి తప్పిందని కిల్లర్ గట్టిగా అరుస్తాడు. దున్నపోతు అదుపుతప్పి సీఎం, సీఎం కొడుకు మీదకు పరుగెడుతుంది. అదే సమయంలో అక్కడి స్కంద వచ్చి దున్నను అదుపు చేస్తాడు. సీఎం ప్రాణభయంతో అలానే చూస్తు ఉంటాడు. దున్నను ఆడించటోడు కాదు ఓడించటోడు విన్నర్ అని హీరోను విన్నర్ గా ప్రకటిస్తాడు. దాంతో హీరో విజయోత్సహంతో సంబరం చేసుకుంటాడు.
తరువాత సీన్లో మనోడు పని మొదలెట్టినాడట అని రాయుడి బమ్మార్ది వచ్చి చెప్తాడు. మొదలెడుతాడు నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్ని అని… ఒక గుణపాన్ని కారుపై విసురి.. వాడి గుండెల్లో దింపుతా అని సీఎం అంటాడు. తరువాత సీన్లో కిల్లర్ మంచి ఛాన్స్ మిస్ అయింది అని మధ్యలో వాడేవడు అని అరుస్తాడు. నీకు ఇంకో ఒక్క ఛాన్స్ మాత్రమే ఉందని అక్కడి ఇన్ఫార్మర్ చెప్పి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో లీల యోగ చేసుకుంటు ఉంటుంది. నేచర్ ను ఫీల్ అవుతుంది. అదే సమయంలో సన్ లైట్ పడుతుందని సెక్యూరిటీ గొడుగు అడ్డుపెడుతాడు. దాంతో కోపం తెచ్చుకున్న లీల డాడీ అంటూ అరుస్తూ లోపలికి వెళ్తుంది. మీటింగ్ లో ఉన్న సీఎం దగ్గరకు వెళ్లి నాకు ఫ్రోటోకాల్స్ వద్దని, నేను సీఎం కూతురిలా కాదు నార్మల్ అమ్మాయిలా చదువాలి అనుకుంటున్నా అని చెప్తుంది. దాంతో సరే అని సీఎం చెప్తాడు. సంజయ్ మాత్రం పిల్లలు అలానే చెప్తారు సైలెంట్ గా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్తాడు. తరువాత సీఎంపై అటాక్ జరగబోతుంది అని, నిన్న సదర్‌లో జరిగింది ప్లానేనా అనే డౌట్ ఉందని డీజీ చెప్తాడు. రాని వస్తే చూసుకుందాం అని సంజయ్ అరుస్తాడు. నిన్న దున్నపోతును ఆపిన అబ్బాయి ఎవరు అంటే.. అతనో కాలేజీ స్టూడెంట్ అని డీజీ చెప్తాడు. అలాంటి వాడు బాబు పక్కన ఉండడం మంచిది అని సంజయం తో చెప్పి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ క్లాస్ లో కూర్చొని ఉంటారు. లెక్చరర్ వచ్చి మీరంతా పొలిటికల్ సైన్స్ ఎందుకు ఎంచుకున్నారు. మీ గోల్స్ ఏంటని స్టూడెంట్స్ ను ప్రశ్నలు అడుగుతాడు. ముందుగా రాహుల్ ను అడుగితే తాను మ్యాథాలిజిస్ట్ అవుతా అని పొలీటిషన్ అంటే వెరి సింపుల్ అది బురద గుంటలాంటిది అని, ముందు గడ్డిపెట్టి ఎన్ని పాలు అయిన పిండొచ్చు అని చెప్తాడు. ఎవరైనా ఎక్కువ చేస్తే ఉచితాలు తీసుకొస్తే సరిపోతుంది అని చెప్తాడు. తరువాత లీల ను అడిగితే తాను ఈ సమజాన్ని మార్చాలని చెబుతుంది. తరువాత స్కందను అడిగితే సీఎం అవుతా అంటాడు. డైరెక్ట్ సీఎం అవుతావా.. అంటే అవును అంటాడు. ఎలా అవుతావు అంటే.. పోయ్యాలే, ఇయ్యాలే, తొయ్యాలే అడ్డం ఎవడన్నా వస్తే లేపెయ్యాలి.. ఇప్పుడున్న సీఎం అలాగే అయ్యాడు కదా అంటాడు. దాంతో స్కందవైపు లీల చూస్తుంది.
క్లాస్ అయిపోయిన తరువాత నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నావు అని స్కందను ఆపీ, లీల అడుగుతుంది. నేను సీఎం అల్లుడిని, సీఎం బిడ్డ నేనేంటే పడిసచ్చిపోతది.. నువ్వు జస్ట్ యావరేజ్ ఫిగర్ అని మాట్లాడుతాడు. దాంతో ఫ్రస్టెట్ అయినా లీల ఇంటికి వచ్చి యోగ చేసుకుంటుంది. ఎంత కాన్సెట్రేట్ చేద్దామన్నా.. స్కంద అన్న మాటలే గుర్తుకు వస్తాయి. దాంతో వాల్ల ఫ్రెండ్ పబ్ కు వెళ్దామని సలహా ఇస్తుంది.
కట్ చేస్తే పబ్ లో గ్యాంగ్ తో కూర్చొని తాగుతుంది లీల. ఇది వర్క్ అవట్ అవుతుంది అని తాగుతూ ఉంటుంది. అక్కడికి స్కంద, రాహుల్ వస్తారు. దగ్గరకు వచ్చి నేను అంటే నీకు చిరాకు కదా.. నాతో డ్యాన్స్ చేయి పోతుంది అని మాట్లాడుతాడు. రాహుల్ కు ఫోర్క్ గుచ్చుతుంది. అతను పట్టించుకోడు నీకు ఫోర్క్ దిగింది అంటుంది. దానికి ఇక్కడ ఎక్కుడే కాని దిగుడు ఉండదు అని అంటాడు రాహుల్. తరువాత స్కందతో డ్యాన్స్ చేస్తుంది. పాట అయిపోయిన తరువాత పబ్ బయట లీల వాళ్ల అన్నయ్య, ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. అదే సమయంలో కిల్లర్ సీఎం కొడుకుకు గురి పెడుతాడు. స్కంద అడ్డు పడుతాడు. తరువాత వాళ్లతో మాట్లాడి హీరో తన బైక్ లో బయలు దేరుతూ.. కారు అడ్డు వస్తే కిల్లర్ వ్యాన్ కు డ్యాష్ ఇస్తాడు. వ్యాన్ ను కొట్టి ఏం జరుగలేదుకదా అని అడుగుతాడు. కిల్లర్ ఏం అవలేదు అని చెప్తాడు. అదే సమయంలో సీఎం కొడుకు కార్లో వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో సదర్‌లో అడ్డుపడినోడే పబ్ లో అడ్డుపడ్డాడు అని అడుగుతే వాడికి డిపార్ట్ మెంట్ కు ఏ విధమైన సంబంధం లేదని ఇన్ఫార్మర్ చెప్తాడు. నీకు ఇచ్చిన రెండు అవకాశాలు మిస్ చేశావు. నువ్వు వెళ్లిపోతే మంచిది అంటాడు. వెళ్లే ముందు వాడి ఇంట్లోకి దూరి కాల్చేసి వెళ్లిపోతా అని కిల్లర్ అంటాడు.
తరువాత సీన్లో రామకృష్ణ రాజు కూతురు అమ్ములు మెడిసిన్ కు రెస్పాండ్ అవట్లేదని డాక్టర్స్ చెబుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రదీప్ మల్హోత్రా నా దగ్గర ఒక మెడిసిన్ ఉందని పోలీసుకు ఫోన్ చేసి రామకృష్ణ రాజుతో ఫోన్ మాట్లాడుతాడు. అతను ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడుతాడు. తాను మెళ్లిగా కదులుతుంది. తరువాత అతన్ని ఫోలీసులు తీసుకుపోతారు. ఇక్కడ ఈ అమ్మాయి మూమెంట్ ఆగిపోతే అక్కడ చాలా మంది బిగ్ షాట్ మూమెంట్స్ ఆగిపోతాయి అని ప్రదీప్ డాక్టర్స్ తో చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో రాత్రి పబ్ వద్ద బాబు మీద ఎటాక్‌కు ప్లాన్ జరిగింది అని డీజీ సీఎంతో చెప్తాడు. సీఎం షాక్ అవుతాడు. రాయుడు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. వాళ్లు ఎక్కడున్నారో తెలిసింది ఎన్ కౌంటర్ చేయమంటావా అని డీజీ అడుగుతాడు. తరువాత సీన్లో ఏపీ సీఎం రాయుడు మీటింగ్ లో ఉండగా.. తెలంగాణ సీఎం ఫోన్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్తాడు. దాంతో ఎపీ సీఎం షాక్ అవుతాడు. దమ్ముంటే ఆపు అని సవాల్ చేస్తాడు. ఫోన్ పెట్టేసిన తరువాత సీఎం కుటుంబ సభ్యులు అంతా అక్కడి వస్తారు. అమ్మాయి తిరిగి రావాలి అని అంటారు. వస్తుంది రేపటికల్లా మన ఇంట్లొ ఉంటుంది, నేను పంపినోడు మాములు వ్యక్తి కాదు అని చెప్తాడు. కట్ చేస్తే కిల్లర్ గ్యాంగ్ మీద ఎన్ కౌంటర్ జరుగుతుంది. కిల్లర్ పోలీసులకు దొరుకుతాడు. అదే విషయాన్ని తెలంగాణ సీఎంకు వీడియో కాల్ చేస్తాడు ఆఫీసర్. వాన్ని చంపొద్దు.. ఇంటికి తీసుకురండి అని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో స్కంద, రాహుల్ కాలేజీలో మాట్లాడుకుంటారు. రాత్రి సీఎం కుతురు ఫోన్ చేసింది. మస్తు సతాయించింది అని రాహుల్ కు చెప్తుంటే లీల, తన గ్యాంగ్ వింటుంది. ఆ యావరేజ్ ఫిగర్ తోటే తిరుగాతా.. ఆమెకు లైఫ్ ఇస్తా అని రాహుల్ తో చెబుతుండగా అక్కడికి లీల వస్తుంది. మన పెయిర్ చూసి మస్తు ఉంది, యావరేజ్ ఫిగర్ ముందు నేను మంచిగున్న అని చాలా మంది పొగిడారు అని చెప్తాడు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది దమ్ముంటే అక్కడి రా అని ఛాలెంజ్ చేస్తుంది లీల. లోకేషన్ పెట్టు అకేషన్ కు వచ్చేస్తా అంటాడు. కట్ చేస్తే సీఎం ఇంట్లో బందోబస్తు భారీగా ఉంటుంది. నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారు. కోడలు హప్పిగా ఉందని అందరు సంతోషపడుతారు. రాయుడి కుటుంబానికి వెబ్ లింక్ పంపించమిన సీఎం చెప్తాడు. అప్పుడే పంపించా అని సంజయ్ అంటాడు. అక్కడికి కిల్లర్ ను తీసుకొచ్చినట్లు పోలీసు ఆఫీసర్ చెప్తాడు. నీ ఫ్రెండ్ అని సీఎం అల్లుడు అని, ఒకడు వచ్చాడు అని సెక్యూరిటీ చెప్తే పంపించు అని హీరోయిన్ చెప్తుంది. మరోవైపు కిల్లర్ గురించి పోలీసు చెబుతూ.. అతను ఇంటలిజెంట్ ద్వారా మీ గురించి తెలుసుకున్నాడు అని చెప్పగానే సీఎంను చంపడానికి ప్రయత్నిస్తాడు కిల్లర్. దాంతో అందరు అతన్ని కాల్చి చంపేస్తారు. అదే సమయంలో ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చి కడపనుంచి ఒకడు వచ్చాడు మీ ఇంట్లో దూరాడు మీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్లాలి అని చెప్తాడు. వచ్చాడు చచ్చాడు అని సీఎం చెప్పి అతన్ని చూపిస్తాడు. అతన్ని చూసిన ఆఫీసర్ వీడు కడుప వాడు ఏంటి సర్.. వీడు మీరు చంపిన నవీన్ బమ్మర్ది అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఆ ఆంధ్ర సీఎం దించే జాకబ్ నే చంపిన అంటకంటే భయంకరమైన వ్యక్తి అని అంటాడు.
తరువాత సీన్లో జాకబ్ తెలంగాణకు వస్తుంటే అతనిపై ఎటాక్ జరుగుతుంది. ఏ జరిగిందిరా అని జాకబ్ అంటుండగా.. పులి ఆటకొచ్చింది అని హీరో ఎంటర్ అవుతాడు. వాళ్లతో ఫైటింగ్ చేస్తాడు. జాకబ్ ముందే అతని మనుషులను నరికేస్తాడు. అక్కిడికి ఇంకొంత మంది వస్తారు. ఎందుకు చంపుతున్నావురా అని అడిగితే అడవిలో ఒక పులికి కుందేలు ఫ్రెండ్ అని కుందెలును తోడేలు గెలికితే పులి ఊరుకుంటుందా అని వాళ్లను తరిమి కొడుతాడు. జాకబ్ జీపులో హీరో నరకడానికి వెళ్తాడు. హీరో తరుముకుంటూ వెళ్లి జాకబ్ ను తల నరికి చంపుతాడు. అతనిపై సీఎం దృష్టిపెట్టాడు అని ఇంటలిజెన్స్ ఆఫీసర్ రంజిత్ రెడ్డితో చెప్తాడు. కల్ట్ మామ సాంగ్ మొదలు అవుతుంది. పాట అయిపోగానే హీరో ట్రాక్టర్ తీసుకొని ఆంధ్ర సీఎం ఇంటికి వెళ్తాడు. సెక్యూరిటీ అంతా గన్స్ పెడుతారు. ఇది పెద్దయాన ఇళ్లు బూట్లు తీసి అడుగుపెట్టు అంటే వినకుండా ఇంట్లోకి వెళ్లి ఏంది పంచాయితీ.. జాకబ్ ను చంపినందుకా అని అంటాడు. వాడు నా మనిషి ఎందుకు చంపినావు అని సీఎం అడుగుతాడు. నా మర్దలను చూసి లేపుకపోతా అని కూసినాడట.. అందుకే చంపినా అని హీరో అంటాడు. ముడతా అంటే చంపేస్తవా అని సీఎం అంటాడు. వాడు కాదు నువ్వు అను నిన్ను కూడా చంపుతా అంటాడు. మ్యాటర్ ఏందో చెప్పు అని హీరో అడుగుతాడు. తన బిడ్డను తెలంగాణ సీఎం కొడుకు లేపుకపోయినాడు. తన కూతుర్ని తీసుకురా అని అడుగుతాడు. వాని కళ్లముందు నుంచే తీసుకొస్తా అని ఏపీ సీఎంతో సవాల్ విసురుతాడు హీరో. ఇదే విషయాన్ని ఇంటలిజెన్స్ ఆఫీసర్ తెలంగాణ సీఎంతో చెప్తాడు. అందుకే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవాలి అని చెప్తాడు. రమ్మను నవీన్ తమ్ముడిని చంపి ఫంక్షన్ మొదలు పెట్టినా, వాన్ని చంపి ఫంక్షను ముగిస్తా అని సంజయ్ అంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే వచ్చేసి ఉంటాడు అనగానే ఓ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. స్కంద ఎంట్రీ ఉంటుంది. అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. సీఎం చూసి షాక్ అవుతాడు. హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. స్కంద ఫైట్ చేస్తాడు. పోలీసుల అందరిని కాల్చి చంపేస్తాడు. సంజయ్ ఫైట్ చేస్తాడు. తన పాయింట్ లోంచి కత్తి తీసి సంజయ్ ని కొడుతూ అందరిని నరికేస్తు ఉంటాడు. ఆంధ్రసీఎం టీవీలో చూస్తూ సంతోషపడుతాడు. సంజయ్ ని చంపబోతే నా తమ్ముడిని ఏం చేయద్దు వాడి కూతుర్ని తీసుకపో అంటాడు. దాంతో హీరోయిన్ చేయిని పట్టుకుంటాడు. మీ ఇద్దరి కూతుర్లను తీసుకపోనికే వచ్చా అని, మీరు చేసిన అన్యాయాలు సమాధానం చెప్పాలి అని రుద్రగంటి రామకృష్ణరాజు తరఫున వచ్చినా.. అని రుద్రరాజపురం నుంచి వచ్చినట్లు చెప్తాడు. ఇద్దరు రుద్రరాజపురం రావాలి.. మర్యాదగా వస్తే అరటాకు వేసి అన్నబెడుతాం.. తేడా వస్తే తాటకేసి తగలబెతాం అని చెప్పి హెలికాప్టర్ లో తీసుకొని వెళ్లిపోతాడు. ఇంటర్ మిషన్.
ఇంటిదగ్గర జరిగినా ఫుటేజ్ మొత్తం చెక్ చేసి డిలేట్ చేయండి అని తెలంగాణ సీఎం అంటాడు. మీకు ఆ రుద్రరాజపురానికి సంబంధం ఏంటి అని ఇంటలిజెన్స్ అడుగుతారు. అదే సమయంలో రాయుడు తన మనుషులతో రంజిత్ రెడ్డి ఇంటికి వస్తాడు. ఇది పర్సనల్ మ్యాటర్ అని అందరిని వెళ్లిపో అని రాయుడు బామ్మర్ది అంటాడు. అందరు వెళ్లిపోతారు. మనం కలిసుంటే ఇలా జరిగేది కాదు అని రంజిత్ రెడ్డి అంటాడు. మన పిల్లలను ముట్టుకున్నోని అంతుచూడాలి.. ఏడుంది వాని ఊరు అని రాయుడు అంటాడు. కట్ చేస్తే.. ఊర్లోకి హెలికాప్టర్ వస్తుంది. వాళ్లను తీసుకొని హీరో వస్తుంటే అందరు చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటారు. వాల్ల నాన్న దగ్గరకు వెళ్లి నిలబడుతాడు. అమ్మాయిలను తీసుకొచ్చినందుకు ఒకటి పీకాల్సి పోయి మెచ్చుకుంటారు అని లీల అంటుంది. నేనే తీసుకురమ్మని చెప్పాను అని స్కంద తండ్రి చెప్తాడు. ఒక మంచిమనిషిని గెలిపించడానికి మిమ్మల్ని తీసుకురమ్మాన్నాని చెప్తాడు.
రుద్రగంగి రామకృష్ణ రాజు క్రౌన్ టెక్నాలజీ చెర్మైన్ గురించి గొప్పగా పొగుడుతూ అతను సాధించిన విజయాలను మీడియా చెప్తుంది. రాయుడు, రంజిత్ ల దగ్గర ఉన్న 5 లక్షల కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు వినోద్ మల్హోత్రాను ఢిల్లీ నుంచి పిలిపిస్తారు. మీ డబ్బంతా రామకృష్ణ రాజు కంపనీలో పెడితే స్పీడ్ గా వైట్ గా మారుతుందని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే రామకృష్ణ రాజు రుద్రరాజపురం వెళ్తుంటారు. అక్కడ అందరు గోవులకు పూజచేస్తూ మొక్కుతారు. అక్కడికి వచ్చిన రాజు ఫ్యామిలీతో మాట్లాడుతుంటారు. అందరిని పరిచయం చేస్తాడు. నీ కొడుకు ఎక్కడరా అని అడుగుతాడు. సాంగ్ మొదలౌతుంది. నాన్న పిలుస్తున్నాడు అని ఫ్రెండ్స్ పిలుస్తే వెళ్తాడు. తరువాత సీన్లో రాజు అందరితో మాట్లాడుతుంటారు. అందరు పిల్లలు ఫారెన్ లో సెటిల్ అయ్యారు అని చెప్తుంటారు. మీ వాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే.. వాడు ఫైనల్ ఈయర్‌లో ఫెయిల్ అయ్యాడు అని చెప్తాడు. దానికి అందరు నవ్వుతారు. అంతలో వస్తున్నాడు అని చెప్తాడు హీరో తండ్రి.. హీరోతో అమ్మాయిలు సరసాలు ఆడుతుంటారు. తరువాత రామకృష్ణను పరిచయం చేసుకుంటాడు. తరువాత అమ్ములను పరిచయం చేసుకుంటాడు. వాళ్లు చాలా రోజుల తరువాత ఊరుకు వచ్చారు. వారికి ఇది బెస్ట్ ఎక్స్ పిరియన్స్ అవాలని హీరో తండ్రి చెప్తాడు. దాంతో వాళ్లకు బెస్ట్ ట్రీట్ ఇస్తాడు. మళ్లీ సాంగ్ స్టార్ట్ అవుతుంది. హీరోకు అమ్ములు క్లోజ్ అవుతుంది. హీరో చెల్లెలు పెళ్లి అయిపోతుంది. తరువాత రాజు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లకు అన్ని మర్యాదలు చేస్తారు. తరువాత కాలేజీలో టాపర్ అయిండి, మంచి ప్యాకెజీని వదులుకొని ఫెయిల్ అయ్యావు అని ఎందుకు అబద్దం చెప్తున్నావు అని స్కందను, రాజు అడుగుతాడు. అమ్మానాన్న కోసం, వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు స్కంద. దాంతో స్కంద పేరెంట్స్ ఎమోషనల్ అవుతాడు. తరువాత రాజు వాళ్లు వెళ్లిపోతారు.
నెక్ట్స్ సీన్లో రామకృష్ణ రాజుతో రాయుడు, రంజిత్ మీటింగ్ లో కూర్చుంటారు. అక్కడే ప్రదీప్ మల్హోత్రా కూడా ఉంటాడు. నాతో ఏంటి పని రామకృష్ణ అడుగుతాడు. మా దగ్గర ఉన్న 5 లక్షల కోట్లను వైట్ మానీగా మార్చాలి అని, దానికి నీ సాయం కావలని చెప్తారు. దానికి రామకృష్ణ ఒప్పుకోడు. బెదిరించినా ఒప్పుకోడు పని ఉందని వెళ్లిపోతాడు. ఇద్దరు సీఎంలు ఈగోకు పోతారు. అతన్ని ఏదైనా చేయాలి అని ప్లాన్ చేస్తారు. అతను తలుచుకుంటే గంటలో పీఎంను కలువగలడు, అలాంటి వాడిని సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టాలి అని పోలీసులతో డ్రగ్స్ ఉన్నాయని రాజు కంపెనీలు అన్ని సీజ్ చేస్తాడు. అలాగే రాజును హౌస్ అరెస్ట్ చేస్తారు. తరువాత అమ్మాయిలతో ఫేక్ వార్తలు చెప్పిస్తారు. సోషల్ మీడియాలో రామకృష్ణ రాజు ఫాలోయింగ్ ను డౌన్ చేస్తారు. తరువాత రామకృష్ణకు ఎగనెస్ట్ గా చెప్పిన అమ్మాయిలను, సోషల్ మీడియాలో పనిచేసేవారిని చంపేస్తారు. రాజు గారు చెప్తేనే మేమే చేశాము అని గుండాలు లొంగిపోతారు. తరువాత సీన్లో పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని చెప్తారు. రామకృష్ణ రాజు కుటుంబం ఒప్పుకోదు. గంటలో వస్తా అని రాజు పోలీసులతో వెళ్తా అంటాడు. బయటకు రాగానే పోలీసు రాజును నెట్టి షర్ట్ పట్టుకొని ఈడ్చుకెళ్తాడు. రాజు ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అంతలో రాజుపై రాళ్లు, చెప్పులు విసురుతారు. అదే సమయంలో రాజు భార్య స్లీపింగ్ పిల్స్ వేసుకుందని హీరోయిన్ పోలీసుల దగ్గర మొకరిల్లుతుంది.
నెక్ట్స్ సీన్లో వినోద్ మల్హోత్ర రాయుడితో మాట్లాడుతాడు. కంపెనీ సీజ్ కాకుండా ఉంటేనే మన ట్రాన్సెక్షన్ ఈజీ అవుతుందని, తన సంతకం కావాలని అంటాడు. తరువాత సీన్లో పోలీస్టేషన్ లో సంజయ్ సంతకం పెట్టమని అడుగుతాడు. అతను పెట్టను అంటే హీరోయిన్ ను కట్టేసి కొడుతారు. రాజు సంతకం పెడుతాడు. తన కూతుర్ని వదిలేయండి అని బతిమిలాడుతాడు. కోర్టులో నిజం చెప్తే నీ కూతుర్ని చంపేస్తా అని చెప్పి వెళ్లిపోతారు. ఇదే విషయాన్ని హీరోయిన్ తో చెప్తాడు స్కంద తండ్రి. నీ బాబులు రావాలి, రాజును నిర్దోషిగా తీసుకురావాలి అందుకోసం అందుకోసమే మిమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్తాడు. అదే సమయంలో హీరో గెటప్ చేంజ్ చేసుకొని వస్తాడు.
మరో సీన్లో ఇద్దరి సీఎంలతో వినోద్ మాట్లాడుతారు. ఈ అమ్మాయి లేచి సంతకం పెట్టాలని, జాగ్రత్తాగా ఉండండి అని చెప్తాడు. అదే సమయంలో హీరో తండ్రి అక్కడికి వచ్చి వాళ్ల ఊర్లో శ్రీరామనవమికి రామకృష్ణరాజను మీరే తీసుకొని రావాలని చెప్తాడు. పండగ జరగాలంటే ఊరు ఉండాలి కదా అని మాట్లాడుతారు సీఎంలు. వచ్చిన విలన్ల గురించి స్కంద తండ్రి చెప్తాడు. మీరు పంపినా గుండాలు నా ఇంట్లో అడుగుపెట్టాలి అంటే నా కొడుకును దాటాలి అని చెప్తాడు. ఎన్ కౌంటర్లు లైవ్ లో చూస్తారటగా.. లింక్ ఓపెన్ చేయండి ఎన్ కౌంటర్స్ చూద్దురుకని అంటాడు. ఒక్కోడికిన వేటాడుతుంటాడు స్కంద. పోలీసు ఆఫీసర్ అందరిలో వాకీ టాకీలో మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతుంటే పోలీసు ఉన్న దగ్గరకే వస్తాడు స్కంద. వాడి చావు చాలా దారుణంగా ఉండాలిరా అంటాడు. అంతే దారుణంగా ఒక్కోక్కరిని చంపేస్తాడు స్కంద. మీ ఇళ్ల మీద పడితేనే ఏం చేయలేదు, వాడి ఊరుమీద పడితే ఊరుకుంటాడా అని స్కంద తండ్రి మాట్లాడి వెళ్లిపోతాడు. కోపంతో సీఎంలు ఫ్రస్టేట్ అవుతారు.
తరువాత సీన్లో స్కంద కాఫీ తాగుతుంటే లీల వస్తుంది. స్కందను కర్రతో కొట్టబోతే ఆపి వచ్చి కూర్చొ అంటాడు. గండరబ్బాయి సాంగ్ స్టార్ట్ అవుతుంది. పాట అయిపోగానే లాయర్ జైలుకు వస్తాడు. మీ కూతురు సేఫ్ గా ఉంది ఇప్పుడు పెట్టండి సర్.. ఆ దేవుడే వచ్చాడు అని చెప్తాడు. తరువాత సీన్లో రాజుకు సంబంధించిన అన్ని డిపార్ట్ మెంట్ లు యాక్టీవ్ అయ్యాయి అని, రాజు నోరు విప్పితే ఢిల్లీ వచ్చి మీ మీద పడుతుందని చెప్తాడు. ఇప్పుడు ఏం చెద్దాం అని ఆలోచిస్తే.. సరెండర్ అని రంజిత్ రెడ్డి అంటాడు. తరువాత సీన్లో రుద్రరాజపురంలో శ్రీరామనవమి సంబరాలు చేసుకుంటారు. అక్కడికి రాజు లాయర్ తో వస్తాడు. అందరు షాక్ అవుతారు. సంతోషించేలోగా లాయర్ ను చంపేస్తారు రౌడీలు. అలా అందరిని పొడుస్తారు. హీరో ఫైట్ చేస్తాడు. ఒక్కొడిని వేటాడుతాడు. కత్తులతో నరుతాడు. అదే సమయంలో సంజయ్, సీఎం బమ్మర్ది హీరోపై ఎటాక్ చేస్తారు. కొట్టి పడేస్తారు. అందరూ షాక్ అవుతారు. వాన్ని తొందరగా ఫినిష్ చేయండి అనే లోపే అటునుంచి కొంతమంది రౌడీలు గాల్లో ఎగిరిపడుతారు. దాంతో సీఎంలు షాక్ అవుతారు. ట్రాక్టర్ మీదనుంచి హీరో వచ్చి ఫైట్ చేస్తాడు. అందరిని కుల్లబొడుస్తాడు. బాణాలతో ఫైట్ చేస్తాడు. ధనస్సును విరిచి కత్తిలా మార్చి ఊచకోత మొదలు పెడుతాడు. సీఎంలను కొట్టి పడేస్తాడు. ఎవర్రా నువ్వు అని సీఎంలు అడుగుతారు. వాళ్లను కొట్టి అతన్ని స్టోరీ చెప్తాడు. అమ్ములు కోసం వచ్చినా అని చెప్తాడు. పెళ్లి అని చెప్పి ఊరికి వచ్చింది. బ్రదర్ ను చూపించింది. తరువాత కనిపించకుండా పోయింది. వెతికితే మీ గురించి నిజాలు తెలిశాయి. అప్పటికే మా వోడు ఆట మొదలు పెట్టాడు అని చెప్తాడు. మీరు చేసిన తప్పులు మీడియా ముందు ఒప్పుకోవాలని చెప్తాడు. వాళ్లు సరే అంటారు. మీడియా వచ్చి అడుగుతుంది. అన్ని తప్పులు ఒప్పుకుంటారు. స్కంద లెస్తాడు. శ్రీరామనవమి జరుగుతుంది. అక్కడికి ఇంటలిజెన్స్ ఆఫీసర్ వస్తాడు. మొరాకోలో ఓ పెద్ద డాన్ ను చంపిన డేంజర్ గాడు అతను అని హీరో గురించి చెప్తాడు. అందరూ షాక్ ఉంటారు. హీరో నడుచుకుంటూ వస్తాడు. స్కంద పార్ట్ 2 టైటిల్ పడుతుంది.