Skanda: ‘స్కంద’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మామూలుగా లేదుగా!
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ అప్పుడే స్కంద ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి స్కంద ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది.
రామ్, బోయపాటి కలిసి చేస్తున్న మాస్ బొమ్మ ‘స్కంద’ రిలీజ్ అవడానికి మరో వారం రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే స్కంద ఫస్ట్ రివ్యూ బయటికొచ్చేసి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్కంద సినిమా సలార్ ప్లేస్‌లో సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్కంద ప్రమోషనల్ కంటెంట్.. ఇది ఊరమాస్ సినిమా అనే చెప్పేసింది. కానీ ప్రమోషన్స్ మాత్రం వీక్‌గా ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కూడా పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ జరగడం లేదు. స్కంద పై ఉన్న అంచనాలకు ఈ డోస్ సరిపోదు. కానీ స్కంద ఫస్ట్ రివ్యూ మాత్రం వైరల్‌గా మారింది.
స్కంద మూవీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాలీ మూవీస్ సంస్థ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ విభాగానికి చెందిన మెంబర్ అంటూ.. ఓ వ్యక్తి ట్విటర్లో స్కంద ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ‘ఆస్ట్రేలియన్ తెలుగు ఫిలీంస్’ అనే పేరుతో ట్వీట్ చేసిన ట్వీట్లో.. ‘స్కంద ఫైనల్ అవుట్‌పుట్.. ఫస్టాఫ్ గుడ్. హీరోయిన్‌తో లవ్ ట్రాక్, కామేడీ సీన్లు సూపర్బ్. డ్యాన్స్ అదిరిపోయింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మంటలే. తమన్ బీజీఎమ్ ఓకే. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సెకండాఫ్ సాగుతుంది.
కల్ట్ మామ సాంగ్, డ్యాన్స్ దుమ్ములేచిపోతుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో 15 నుంచి 20 నిమిషాలు అదిరిపోయింది. ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్స్ వస్తాయి. ఇది పక్కా బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్’ అని రాసుకొచ్చారు. మరి ఫస్ట్ రివ్యూనే పాజిటివ్‌గా ఉంది కాబట్టి.. రిలీజ్ అయ్యాక స్కంద ఎలాంటి రివ్యూలు సొంతం చేసుకుంటుందో చూడాలి.