SKLM: వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి పంచాయతీలో సచివాలయం లేక అనేక అవస్థలు పడుతున్నామని సచివాలయ సిబ్బంది తెలిపారు. సొంత సచివాలయం లేకపోవడంతో పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వహించాల్సి వస్తుందన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి, సొంత సచివాలయాన్ని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.