»Shruti Haasan When It Comes To Marriage The Heroine Is Under Pressure
Shruti Haasan: పెళ్లి ప్రస్తావన వస్తే..ఒత్తిడికి గురవుతున్నా
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ రోజుల్లోనే మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Shruti Haasan: కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్ మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ రోజుల్లోనే తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా.. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా శ్రుతి హాసన్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. 30 ఏళ్లు దాటిన తర్వాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని, జరిగిన మార్పులు గురించి చెప్పారు. 30 ఏళ్లు దాటిన తర్వాత తనలో ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. పూర్తిగా మారిపోయానన్నారు. దేనికైనా సమాధానం చెబుతున్నానని తెలిపింది. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంటున్నానని వెల్లడించింది.
ఈ క్రమంలో కొందరు తన పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. 30 ఏళ్లు నిండాయని, వయస్సు అయిపోతుంది.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అంటుంటారు. ఇలాంటప్పుడు తాను ఒత్తిడికి గురవుతున్నానని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చారు. 30 ఏళ్లు ఏదో పెద్ద సమస్యగా అందరూ అడుగుతుంటారు. కానీ నా దృష్టిలో ఇది సమస్యే కాదు. అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేసి.. జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించానని అన్నారు. 30 నిండిన తర్వాత వృత్తి పరంగా కూడా మార్పులు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. శ్రుతి హాసన్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే హీరో నాని నటిస్తోన్న ‘హాయ్ నాన్న’లోనూ శ్రుతి హాసన్ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలిసింది.