»Shock For Pan India Heroes Pawan Kalyan In Top 10
Pawan Kalyan: పాన్ ఇండియా హీరోలకు షాక్.. టాప్-10లో పవర్ స్టార్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే టాప్ టెన్‌లో నిలిచాడు పవర్ స్టార్. దీంతో పాన్ ఇండియా హీరోలకు పవర్ స్టార్ షాక్ ఇచ్చినంత పనైంది.
Shock for pan India heroes.. Pawan Kalyan in top-10!
Pawan Kalyan: ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్డమ్లో భారీ సినిమాలు చేస్తున్నారు. పవన్ మాత్రం రీజనల్ సినిమాలతో సరిపెడుతున్నాడు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా పాన్ ఇండియా హీరోలకు మించి టాప్ టెన్‌లో నిలిచాడు పవన్. ఈ మధ్యకాలంలో ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్ లేకుండా ఉండలేకపోతున్నారు. సెలబ్రిటీస్ ఎలాంటి విషయాన్నైనా సరే సోషల్ మీడియా వేదికగానే షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్‌కు ట్విట్టర్లో అకౌంట్ ఉంది. రీసెంట్గా ఇన్‌స్టాలోకి కూడా అడుగు పెట్టాడు పవన్. అకౌంట్ అలా క్రియేట్ అయిందో లేదో.. గంటల వ్యవధిలోనే మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకొని సరికొత్త రికార్డ్ సృష్టించాడు పవర్ స్టార్.
ఫస్ట్ పోస్ట్‌గా తనతో కలిసి పని చేసిన సెలబ్రిటీల లిస్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక ట్విట్టర్లో ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటాడు పవర్ స్టార్. అందుకే పోయిన నెలలో టాప్ టెన్‌లో నిలిచాడు పవన్. ట్విట్టర్లో జూలై నెలలో ఎక్కువగా చర్చించుకున్న భారతీయుల టాప్-10 జాబితాను రిలీజ్ చేయగా.. తెలుగు హీరోల్లో పవన్ కల్యాణ్ ఒక్కడికే చోటు దక్కింది. ఈ లిస్ట్‌లో భారత ప్రధాని మెదీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో సునీల్ ఛైత్రీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఎల్విష్ యాదవ్, పవన్ కళ్యాణ్, సీఎం యోగి ఆధిత్యనాథ్ ఉన్నారు. తమిళ హీరోలు సూర్య, విజయ్‌లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో స్టార్ హీరోల్లో షారుఖ్ తర్వాత ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నిలిచాడని చెప్పొచ్చు. ఏదేమైనా పవర్ స్టార్ క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉందని చెప్పాలి.