Sharwanand:ఇంట్రెస్టింగ్..’బేబీ ఆన్ బోర్డ్’ అంటున్న నటుడు!
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. అందుకే ఈ సారి భారీ ఆశలతో ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి తర్వాత శర్వా చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను శర్వాకు సవాల్‌గా మారింది. అందుకే.. 'బేబీ ఆన్ బోర్డ్' అని అంటున్నాడట శర్వానంద్.
Sharwanand: గతేడాది వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు శర్వానంద్. ఆ తర్వాత చేసిన ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మాత్రం పర్వాలేదు అనిపించింది. ఇటీవల రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శర్వానంద్ కెరీర్లో 35వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేయగా.. స్టైలిష్ లుక్‌లో అదరిపోయేలా ఉన్నాడు శర్వానంద్. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ మాత్రం ప్రకటించలేదు మేకర్స్. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాకు ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇది.. మేకర్స్ వర్కింగ్ టైటిల్ మాత్రమేనని అంటున్నారు.
ఒకవేళ ఇదే టైటిల్‌ను ఫైనలైజ్ చేస్తే.. ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. రీసెంట్గా వచ్చిన ‘బేబీ’ సినిమాకు యూత్ బ్రహ్మరథం పట్టారు. ఐదారు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శర్వానంద్ సినిమాకు ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తే.. ఖచ్చితంగా కలిసొచ్చేలా ఉంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత.. యూవీ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట శర్వానంద్. ఈ సినిమాకు Loser సిరీస్ ఫేం అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు అభిలాష్. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. 90ల కాలం నాటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. త్వరలో దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.