»Shanmukh Jaswanth Siris Comments On Shanmukhs Arrest Are Viral
Shanmukh Jaswanth: షణ్ముఖ్ అరెస్ట్ పై సిరి కామెంట్స్ వైరల్!
గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయి.. గత వారం పది రోజులుగా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు షణ్ముఖ్. అయితే.. లేటెస్ట్గా సిరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Shanmukh Jaswanth: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పోలీసులకు దొరకడం.. బెయిల్ పై విడుదలవడం జరగిపోయాయి. అయితే.. తాను డ్రగ్స్‌కి అలవాటు పడటానికి డిప్రెషన్ కారణం అని.. ఇంటరాగేషన్‌లో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడట. దీంతో.. షణ్ముఖ్ డిప్రెషన్‌కి దీప్తి సునైనతో బ్రేకప్ ఓ కారణం కావచ్చని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లే ముందు.. సూపర్ జోడి అనిపించుకున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైన.. బయటికొచ్చాక విడిపోయారు.
వీళ్లు విడిపోవడానికి సిరినే కారణమని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో షన్నూ.. సిరితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. అందుకే.. దీప్తి, షణ్ముక్ బ్రేకప్ తీసుకున్నట్టు టాక్ ఉంది. కానీ సిరి, శ్రీహాన్ మాత్రం బాగానే ఉన్నారు. అయినా కూడా సిరి వల్లే ఈ బ్రేకప్ అయిందని అన్నారు. ఇక ఇప్పుడు షణ్ముఖ్ అరెస్ట్ నేపథ్యంలో.. సిరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. హౌస్ నుండి బయటకు వచ్చాక ట్రోలింగ్ జరిగింది.. రూమర్స్ బాధపెట్టాయి.. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను.. అని చెప్పుకొచ్చింది.
కానీ.. షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించలేదదు. షణ్ముఖ్‌ని కలవకపోవడానికి కారణం కూడా ఉంది. అతనికి బ్రేకప్ అయ్యాక మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపించింది.. ఇద్దరం కెరీర్ పరంగా బిజీ అయిపోయాం.. మళ్లీ షణ్ముఖ్‌ను కలిసినా కలవకపోయినా.. అతను బాగుండాలని కోరుకుంటాను.. అని చెప్పుకొచ్చింది సిరి. ప్రస్తుతం సిరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.