Shahid Kapoor Shares His Wife Decision On Kabir Singh
Kabir Singh: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. విజయ్ దేవర కొండ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఇదే మూవీని సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ పేరిట హిందీలో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ హీరోగా చేయగా, కియారా హీరోయిన్గా నటించింది. అక్కడ కూడా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మూవీ విషయంలో తన భార్య మీరా రాజ్ పూత్ అభిప్రాయాన్ని తాజాగా షాహీద్ కపూర్ పంచుకున్నారు.
షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పాత్రను పోషించడానికి మొదట సంకోచించాడని, చివరికి అతని భార్య మీరా రాజ్పుత్ ఈ ప్రాజెక్ట్ను అంగీకరించమని ఒప్పించిందని వెల్లడించారు. ఆఫర్ రాగానే చేయలేనని చెప్పేశాను వివరించారు. విజయ్ దేవర కొండ చేసినట్లు ఈ మూవీలో తాను చేయగలనో లేదో అనిపించింది. ప్రేక్షకులను తనను ఇప్పటివరకు చాలా పాత్రల్లో చూశారు, ఈ పాత్రలో స్వీకరిస్తారో లేదోనని నో చెప్పా. తన భార్యతో చర్చించాను. తాను నన్ను ఈ మూవీ చేయడానికి అంగీకరించేలా చేసింది. ప్రేక్షకులు తనను లవ్ స్టోరీల్లో చూడటానికి ఇష్టపడుతుంటారని, వెంటనే ఈ మూవీకి ఒకే చేయమని చెప్పిందని, అందుకే తాను అంగీకరించానని షాహిద్ చెప్పారు.
కబీర్ సింగ్ తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి చిత్రం యొక్క హిందీ రీమేక్. కియారా అద్వానీతోపాటు షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషించారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద ₹250 కోట్లకు పైగా వసూలు చేసింది. మూవీపై విమర్శలు కూడా అంతే గట్టిగా రావడం గమనార్హం.