సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ కొండేటి ఓ సందర్భంలో.. ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అడిగారు.
సంతోషం’ సురేష్ (Suresh Kondeti) అంటే ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో మంచి పేరు. సంతోషం సినీ వారపత్రికను స్థాపించి.. దాన్ని విజయవంతంగా నడపడమే కాకుండా అదే పేరుతో మూవీ అవార్డులు కూడా ఇచ్చిన ఘనత సురేష్‌ది. ఆయన నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశారు. అంతటి చరిత్ర ఉన్న సురేష్ కొండేటి (Suresh Kondeti) ఈ మధ్య సోషల్ మీడియాలో జోకర్ అయిపోయారు. ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. వాస్తవానికి సోషల్ మీడియా(Social media)లో ట్రోలింగ్ చేసేవాళ్లకి ఆయన గురించి, ఆయన సాధించిన విజయాల గురించి తెలియకపోవచ్చు. కానీ, వారికి ట్రోలింగ్ చేసే అవకాశం ఇస్తున్నది మాత్రం సురేష్ కొండేటే. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం బేబి (baby movie) . జూలై 14న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి, విరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సాయి రాజేష్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
చిత్ర రిలీజ్ మరి కొద్ది రోజులే ఉండడంతో మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర బృందాన్ని సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ కొండేటి ఓ సందర్భంలో.. ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అడిగారు. దానికి హీరోయిన్ ఏం సమాధానం ఇవ్వాలో అర్ధం కాలేదు.అప్పుడు సురేష్ కొండేటి.. బేబి సినిమాలో హీరో .. ముద్దు పెట్టుకుంటా అని అన్నాడు కదా, దానికి మీ రియాక్షన్ ఏంటి’ అని అడిగి కాస్త కాంట్రవర్షియల్ అయ్యేలా చేశాడు. ‘ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న.. ముద్దు పెట్టుకుంటా అన్నాడు, దానికి మీ రియాక్షన్ ఏంటి’ అని తన క్వశ్చన్‌ను నవ్వుతూ తనదైన వివాదస్పద శైలిలో అడిగారు. ఓహో టీజర్(Teaser)లో ఉన్న సీనా అని వైష్ణవి గుర్తు తెచ్చుకుని.. ‘చెప్పు తెగుద్ది అంటాను’ అని చెప్పారు. ‘ఓహో చెప్పు తెగుద్దా’ అని సురేష్ కొండేటి అంటారు.
బహుశా ఇది సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న కావచ్చు. కానీ, ఇప్పటికే సురేష్ కొండేటిని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నవారికి ఈ వీడియో ఒక ఆయుధంలా దొరికింది. ఇంకేముంది.. ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. సురేష్ కొండేటిని ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ‘నాకు మా ఇంట్లో అమ్మా నాన్నా తిడితేనే చాలా బాధేసేది. మీకన్నా వయసులో చిన్న వాళ్ళు, టోటల్ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు.. మొహం మీద ఉమ్మేస్తున్నా ఎలా సార్ ఇలా తుడిచేసుకుని బతికేస్తున్నారు?’ అని ఒక నెటిజన్ (Netizen) ట్విట్టర్లో సురేష్ కొండేటిని ట్యాగ్ చేసి మరీ ప్రశ్నించాడు. ఇలాంటి ఇంకా చాలానే ఉన్నాయి. మరి వీటిపై ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.