WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపెల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్ఎం, ఉపాధ్యా యులు ఉండే ఆఫీసును సైతం తరగతి గదిగా మార్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఆరుబయటే క్లాసులు చెబుతూ కాలం వెల్లదీస్తుండగా, వర్షాలు కురిస్తే ఒకే గదిలో రెండేసి క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.