CTP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని మామిడి పండు ఇస్తానని ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆకర్షించి, గడ్డివామి దగ్గరకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారి భయంతో ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.