చిత్తూరు: మామిడి రైతుల సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. వైసీపీ నాయకులు మామిడి మద్దతు ధర కొరకై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ 9న బంగారుపాళ్యంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు మినహా మరే ఎమ్మెల్యేలు స్పందించకపోవడం గమనార్హం.