GNTR: ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారు శాకంబరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాలు స్వీకరించారు. శాకాంబరి అలంకారం అంటే అమ్మవారిని పండ్లు, కూరగాయలతో అలంకరించడం అని ఇది సంప్రదాయంగా ఆషాడ మాసంలో జరుపుకుంటామని అర్చకులు తెలిపారు.